● జలదిగ్బంధంలో కృష్ణా కలెక్టరేట్
మచిలీపట్నం నగరంలో బుధవారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో కలెక్టరేట్ పరిసరాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గురువారం ఉదయం నుంచి కురిసిన వర్షానికి మోకాలి లోతు నీళ్లతో రహ దారులన్నీ జలమయమయ్యాయి. కార్యాలయానికి వచ్చిన ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. ఏ కార్యాలయానికి వెళ్లాలన్నా మోకాలి లోతు నీళ్లలో నడిచి వెళ్లాల్సి వచ్చింది. కలెక్టరేట్‌కు వెళ్లే రహదారులన్నీ జలమయం కావటంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి రహదారుల్లో వర్షపునీరు నిలవకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.
– చిలకలపూడి(మచిలీపట్నం)
● జలదిగ్బంధంలో కృష్ణా కలెక్టరేట్


