లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో మత్తు మందుల విక్రయాలపై పటిష్ట నిఘా అవసరమని ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఈగల్ విభాగం, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, ఏపీ కెమిస్ట్స్ అండ్ డ్రగ్జిస్ట్ అసోసియేషన్ సమన్వయంతో సోమవారం నగరంలోని ఓ ఫంక్షన్ హాలులో సమావేశం నిర్వహించారు. ఓపియాయిడ్ డ్రగ్ దుర్వినియోగాన్ని నిరోధించడం అనే అంశంపై ఆపరేషన్ గరుడ–2లో భాగంగా నిర్వహించిన ఈ సదస్సులో ఆకే రవికృష్ణ మాట్లాడారు. మత్తు మందుల వినియోగ వ్యతిరేక పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. మత్తుకు సంబంధించిన మందులని వినియోగించే క్రమంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై వర్క్ షాప్‌ను నిర్వహించామని చెప్పారు. కార్యక్రమంలో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ఈట మంజుల, ఈ హోస్మానీ, డీసీపీ కేజీవీ సరితలతో పాటు పలువురు ఈగల్ విభాగం, డ్రగ్‌కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం అధికారులు పాల్గొన్నారు.
ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ