
డీఎస్‌ఓగా మోహన్‌బాబు బాధ్యతల స్వీకరణ
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా పౌరసరఫరాల అధికారిగా జి.మోహన్‌బాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు డీఎస్‌ఓగా పనిచేసిన వి.పార్వతి తూర్పుగోదావరి జిల్లా డీఎస్‌ఓగా బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో పౌరసరఫరాలశాఖ కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తున్న మోహన్‌బాబును కృష్ణాజిల్లా డీఎస్‌ఓగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన కలెక్టర్ డి.కె. బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మను గురువారం మర్యాదపూర్వకంగా కలిసి మొక్కలు అందజేసిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు.
సీజనల్ వ్యాధులపై కమాండ్ కంట్రోల్ రూమ్
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే వివిధ శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చామని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. 91549 70454 సెల్ నంబరుతో కలెక్టరేట్‌లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మలేరియా, డెంగీ, డయేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యం, యాంటీ లార్వాల్ ఆపరేషన్లు, ఫాగింగ్, ఓవర్ హెడ్ ట్యాంకుల క్లీనింగ్ అండ్ క్లోరినేషన్, ఆస్పత్రుల్లో వైద్య సేవలు, ఇంటింటి ఫీవర్ సర్వే తదితరాలపై క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశామని వివరించారు. సీజనల్ వ్యాధులు, విష జ్వరాల నియంత్రణపై వివిధ శాఖల అధికారుల మధ్య పటిష్ట సమన్వయం, సమాచార మార్పిడి, తక్షణ స్పందనకు వీలుగా కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ఈ కంట్రోల్ రూమ్‌కు చేరిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి ప్రత్యేక బృందాలకు అందించి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోనున్నామని వెల్లడించారు. ప్రజలతో పాటు అధికారులు, సిబ్బంది ఎవరైనా సీజనల్ వ్యాధులకు సంబంధించిన సమాచారాన్ని కంట్రోల్ రూమ్‌కు తెలపొచ్చని సూచించారు. సీజనల్ వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అన్ని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ప్రత్యేక ర్యాలీలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 11న ఫ్రైడే – డ్రైడే కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని అన్ని నియోజకవర్గాల ప్రత్యేక అధికారులకు సూచించామని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.

డీఎస్‌ఓగా మోహన్‌బాబు బాధ్యతల స్వీకరణ