
ప్రభుత్వ స్కూళ్లలో మెరుగైన ఫలితాలు రాబట్టాలి
హనుమాన్‌జంక్షన్ రూరల్: ప్రభుత్వం, దాతలు అందిస్తున్న సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు సాధించే దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ చెప్పారు. బాపులపాడు మండలం రేమల్లేలోని జెడ్పీ హైస్కూల్‌ను బుధవారం ఆయన సందర్శించారు. మాక్సిమస్ ఏఆర్సీ లిమిటెడ్ సౌజన్యంతో పాఠశాలలో ఏర్పాటు చేసిన నూతన ఆర్వో ప్లాంట్, కంప్యూటర్ ల్యాబ్, భోజనశాలను కలెక్టర్ బాలాజీ ప్రారంభించారు. మాక్సిమస్ ఏఆర్సీ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధి దేవినేని నన్హరామ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు ఎన్.లూథర్‌పాల్ చాంబర్‌లో పాఠశాల ఉపాధ్యాయులతో కలెక్టర్ డీకే బాలాజీ సమావేశమయ్యారు. గురువారం నిర్వహించనున్న మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ నిర్వహణ, ఏర్పాట్లపై ఆరా తీశారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. పాఠశాలలో మొక్క నాటారు. గుడివాడ ఆర్డీవో జి.సుబ్రహ్మణ్యం, తహసీ ల్దార్ మురళీకృష్ణ, ఎంఈవో బాలాసింగ్ పాల్గొన్నారు.
కలెక్టర్ డీకే బాలాజీ