
ఈడ్చి పడేశారు!
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో సాగుతున్న దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్‌ఎఫ్) బుధవారం నిరసన వ్యక్తం చేసింది. ఎంజీ రోడ్డులో ఇందిరా టవర్స్ వద్ద ఉన్న శ్రీ చైతన్య కళాశాల వద్ద చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జుల వలరాజు, ప్రధాన కార్యదర్శి బందెల నాసర్‌లు మాట్లాడుతూ ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు, దుస్తులు వంటివి కూడా విక్రయం చేస్తున్నార న్నారు. నోట్ పుస్తకాలు సైతం విక్రయాలు జరపడమేంటని ప్రశ్నించారు. దీంతో మాచవరం పోలీసులు అక్కడకు చేరుకుని విద్యార్థి సంఘం నేతలపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు, వారిని ఈడ్చుకుంటూ వెళ్తి జీపు ఎక్కించి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వలరాజు మాట్లాడుతూ కార్పొరేట్ దోపిడీని అడ్డుకోవాల్సిన అధికారులు, పోలీసులు ప్రశాంతంగా నిరసన తెలియజేస్తున్న తమపై కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. దోపిడీని అడ్డుకోవాల్సిన విద్యాశాఖ మంత్రి ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. పోలీసులు వీధి రౌడీల్లా విద్యార్థి సంఘ నాయకుల పట్ల వ్యవహరించారని మండిపడ్డారు. స్టేషన్‌లో ఉన్న విద్యార్థి సంఘ నాయకులను సీపీఐ నగర కార్యదర్శి జి. కోటేశ్వరరావు పరామర్శించారు. సమాఖ్య ఉపాధ్యక్షుడు ఎం. సాయికుమార్ పాల్గొన్నారు.
విద్యార్థి సంఘ నాయకులపై పోలీస్ జులుం కార్పొరేట్ కాలేజీల్లో ఫీజు దోపిడీపై ఆందోళన చేస్తున్న ఏఐఎస్‌ఎఫ్ నాయకులు అరెస్ట్

ఈడ్చి పడేశారు!

ఈడ్చి పడేశారు!