జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి
నందిగామటౌన్: జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా నాయకుడు ఆకుల వెంకట నారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఆర్డీవో కార్యాలయంలో బుధవారం ఆర్డీవో బాలకృష్ణను కలసి వినతిపత్రం అంద జేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జర్నలిస్టులపై జరిగే దాడులను అరికట్టేందుకు హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హైపవర్ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ది న్యూ ఇండియా జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసి యేషన్ జాతీయ ఉపాధ్యక్షుడు పటాన్ మీరా హుసేన్ ఖాన్, జర్నలిస్టు సంఘ నాయకులు శ్రీనివాసరావు, సాంబశివరావు, ఖుద్దూస్, చందు, అనిల్, సురేష్, నరసింహ, సీతారామ్ పాల్గొన్నారు.


