
ఆడుదాం ఉల్లాసంగా.. ఉత్సాహంగా
విజయవాడస్పోర్ట్స్: క్రీడల రాజధాని విజయవాడ వేదికగా ఈ ఏడాది వేసవి క్రీడా శిక్షణ శిబిరాల ఏర్పాటుకు అధికారులు సన్నద్ధమయ్యారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో 23 క్రీడాంశాల్లో చిన్నారులకు శిక్షణ ఇచ్చేందుకు 50 శిబిరాల ఏర్పాటునకు ప్రణాళిక సిద్ధం చేశారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈ నెల రెండో తేదీన ఈ శిబిరాలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే దేశ ప్రధాని నరేంద్రమోదీ అమరావతి పర్యటన నేపథ్యంలో శిబిరాల ఏర్పాటు మూడు రోజులు వాయిదా పడింది. శిబిరాలకు సంబంధించిన దస్త్రాలను జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఇప్పటికే కలెక్టర్ కార్యాలయానికి పంపింది. అక్కడ నుంచి ఆదేశాలు రాగానే శిబిరాలను ఏర్పాటు చేసేందుకు క్రీడా శాఖ అధికారులు సమాయత్తమవుతున్నారు.
క్రీడాంశం నిర్వహించే ప్రదేశం
అథ్లెటిక్స్ 01.ఇందిరాగాంధీ స్టేడియం, 02.రైల్వే స్టేడియం(విజయవాడ), 03.ఎంబీపీ స్టేడియం(సింగ్‌నగర్), 04.ఆంధ్రా లయోల కాలేజీ
ఆర్చరీ ఓల్గా ఆర్చరీ అకాడమీ(మహానాడు రోడ్డు)
బాస్కెట్‌బాల్ 01.ఇందిరాగాంధీ స్టేడియం, 02.జెడ్పీహెచ్‌ఎస్(పటమట), 03.కేవీకే స్టేడియం(జగ్గయ్యపేట)
బ్యాడ్మింటన్ 01.ఇండోర్ స్టేడియం(పటమట), 02.కేవీకే స్టేడియం(జగ్గయ్యపేట)
బాక్సింగ్ 01.ఇందిరాగాంధీ స్టేడియం, 02.కేవీకే స్టేడియం(కృష్ణలంక), 03.స్పోర్ట్స్‌ఫిట్‌నెస్ క్లబ్(భవానిపురం), 04.ఎస్‌కేపీవీ స్కూల్(వన్‌టౌన్)
ఫుట్‌బాల్ 01.ఇందిరాగాంధీ స్టేడియం, 02.ఎంబీపీ స్టేడియం(సింగ్‌నగర్), 03.జెడ్పీహెచ్‌ఎస్(నిడమానూరు), 04. రైల్వే ఇనిస్టిట్యూట్(రాయనపాడు)
హ్యాండ్‌బాల్ 01.జెడ్పీహెచ్‌ఎస్(నున్న), 02. ఇందిరాగాంధీ స్టేడియం
హాకీ 01.జెడ్పీహెచ్‌ఎస్(నున్న), 02. ఎంబీపీ స్టేడియం(సింగ్‌నగర్)
జూడో 01.ఇందిరాగాంధీ స్టేడియం, 02. వైఎస్సార్ కాలనీ(జక్కంపూడి), 03.శుభోదయ స్కూల్(సింగ్‌నగర్), 04.కేఆర్‌వీఆర్ స్పోర్ట్స్ క్లబ్(కండ్రిక)
కబడ్డీ 01.ఇందిరాగాంధీ స్టేడియం, 02. రైల్వే కాలనీ(విజయవాడ) 03.రైల్వే స్టేడియం(విజయవాడ), 04.జెడ్పీహెచ్‌ఎస్(అంబాపురం), 05.జెడ్పీహెచ్‌ఎస్(తిరువూరు)
నెట్‌బాల్ ఇందిరాగాంధీ స్టేడియం, జెడ్పీహెచ్‌ఎస్(పటమట)
ఫవర్ లిఫ్టింగ్ కేవీకే స్టేడియం(జగ్గయ్యపేట)
సాఫ్ట్‌బాల్ పాయకాపురం, రాధానగర్ జూనియర్ కాలేజీ
సాఫ్ట్ టెన్నిస్ ఇందిరాగాంధీ స్టేడియం
టేబుల్ టెన్నిస్ డీఆర్‌ఎంసీ స్టేడియం(విజయవాడ)
తైక్వాండో ఇందిరాగాంధీ స్టేడియం
లాన్‌టెన్నిస్ ఇందిరాగాంధీ స్టేడియం
వాలీబాల్ 01.ఇందిరాగాంధీ స్టేడియం, 02.జెడ్సీహెచ్‌ఎస్(ఆల్లూరు), 03.జి.కొండూరు, 04.జెడ్పీహెచ్‌ఎస్(కొండపల్లి), 05.జెడ్పీహెచ్‌ఎస్(వీరులపాడు)
వాటర్ స్పోర్ట్స్ పున్నమి ఘాట్(విజయవాడ)
వెయిట్ లిఫ్టింగ్ 01.ఇందిరాగాంధీ స్టేడియం, 02.ఫిట్‌జోన్ జిమ్(తిరువూరు)
రెజ్లింగ్ జెడ్పీహెచ్‌ఎస్(నున్న), ఎస్‌కేపీవీ స్కూల్(వన్‌టౌన్)
ఉషు చిట్టినగర్
యోగ కేవీకే స్టేడియం(కృష్ణలంక)
వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు సన్నాహాలు జిల్లా వ్యాప్తంగా 23 క్రీడాంశాల్లో 50 శిబిరాల ఏర్పాటు గ్రామీణ, పట్టణ, నగరాల్లో నిర్వహణ
నిష్ణాతులైన కోచ్‌లతో శిక్షణ..
ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) ఆదేశాల మేరకు నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ఈ శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేశాం. ఈ నెల రెండో తేదీన ప్రారంభం కావాల్సిన ఈ శిబిరాలు ప్రధాని నరేంద్రమోదీ పర్యటన నేపథ్యంలో వాయిదా వేశాం. 8 నుంచి 14 ఏళ్ల లోపు వయసున్న చిన్నారుల్లో క్రీడా నైపుణ్యాలను వెలికి తీసేందుకు ఈ శిబిరాల ఏర్పాటు జరిగింది. నిర్ధేశించిన సమయాల్లో క్యాంపుల వద్ద కోచ్‌లు అందుబాటులో ఉంటారు. ఆసక్తి ఉన్న చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలి.
– ఎస్.ఎ.అజీజ్, డీఎస్‌డీవో, ఎన్టీఆర్ జిల్లా

ఆడుదాం ఉల్లాసంగా.. ఉత్సాహంగా