ర్యాంకుల ఫ్యాక్టరీల్లో మార్కుల యంత్రాల్లా విపరీతమైన ఒత్తిడిలో కాలం గడిపే విద్యార్థులకు వేసవి సెలవులు గొప్ప విరామం. ఈ సమయాన్ని విద్యార్థులు ఎక్కువగా వినోదానికి కేటాయిస్తారు. అయితే చిన్నారులు, యువత తమ నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు గొప్ప అవకాశాలు కల్పిస్ | - | Sakshi
Sakshi News home page

ర్యాంకుల ఫ్యాక్టరీల్లో మార్కుల యంత్రాల్లా విపరీతమైన ఒత్తిడిలో కాలం గడిపే విద్యార్థులకు వేసవి సెలవులు గొప్ప విరామం. ఈ సమయాన్ని విద్యార్థులు ఎక్కువగా వినోదానికి కేటాయిస్తారు. అయితే చిన్నారులు, యువత తమ నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు గొప్ప అవకాశాలు కల్పిస్

May 1 2025 1:50 AM | Updated on May 1 2025 1:50 AM

ర్యాం

ర్యాంకుల ఫ్యాక్టరీల్లో మార్కుల యంత్రాల్లా విపరీతమైన ఒత్

‘యోగా’నందం..

విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియం ఆవరణలోని ఈ–బ్లాక్‌ ఉన్న అమరావతి యోగ అండ్‌ ఏరోబిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో 45 రోజుల పాటు ఉచిత శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. వీటిలో యోగాసనాలు, ప్రాణాయామం, సూర్య నమస్కారాల్లో శిక్షణ ఇస్తారు. వివరాలకు 90147 46719, 98487 32626లో సంప్రదించవచ్చు.

డ్యాన్స్‌ బేబీ డ్యాన్స్‌..

విజయవాడ బందరురోడ్డులోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో అమరావతి బాలోత్సవం ఆధ్వర్యంలో విద్యార్థులకు స్పోకెన్‌ ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌, హ్యాపీ హ్యాపీ సమ్మర్‌ పేరుతో డ్యాన్స్‌లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కంప్యూటర్‌లో ఎంఎస్‌ ఆఫీస్‌, ట్యాలీ, డీపీపీ, కోలెడ్రా, సీ–లాంగ్వేజ్‌లో యువతీ యువకులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. వివరాలకు 90145 41958లో సంప్రదించవచ్చు.

శ్లోకం.. భావం..

చిన్మయ మిషన్‌ విజయవాడ ఆధ్వర్యంలో చిన్మయ బాలల వేసవి శిబిరం–2025 పేరుతో 7 నుంచి 13ఏళ్ల లోపు బాల, బాలికలకు సంస్కృతి–సంప్రదాయాలు పేరుతో వివిధ అంశాల్లో శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. యోగా, భగవద్గీతలోని కథలు, శ్లోకాలు, భజనలు, గేమ్స్‌, క్విజ్‌, ఆర్ట్స్‌, పజిల్స్‌ అంశాల్లో శిక్షణ ఇస్తారు. ఆసక్తి ఉన్న వారు సూర్యారావు పేటలోని చిన్మయ మిషన్‌ కేంద్ర కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.

‘ఆర్ట్‌’ఫుల్‌ స్కిల్‌..

మొగల్రాజపురం రావిచెట్టు సెంటర్‌లో ఉన్న జనశిక్షణ సంస్థాన్‌ ఆధ్వర్యంలో వేసవి సందర్భంగా చాక్లెట్‌ మేకింగ్‌, శారీ వర్క్‌, ఫ్లవర్‌ మేకింగ్‌, మిర్రర్‌ వర్క్‌, స్క్రీన్‌ ప్రింటింగ్‌, పెయింటింగ్‌ ఆర్టికల్స్‌ కోర్సుల్లో ఉచిత శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలకు 0866–2470420లో సంప్రదించవచ్చు.

ర్యాంకుల ఫ్యాక్టరీల్లో మార్కుల యంత్రాల్లా విపరీతమైన ఒత్1
1/1

ర్యాంకుల ఫ్యాక్టరీల్లో మార్కుల యంత్రాల్లా విపరీతమైన ఒత్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement