కలానికి సంకెళ్లా..? | - | Sakshi
Sakshi News home page

కలానికి సంకెళ్లా..?

Apr 12 2025 2:09 AM | Updated on Apr 12 2025 2:09 AM

కలాని

కలానికి సంకెళ్లా..?

సాక్షి దినపత్రిక ఎడిటర్‌ ధనంజయరెడ్డి, మరో ఆరుగురు పాత్రికేయులపై క్రిమినల్‌ కేసులు పెట్టడాన్ని శుక్రవారం పలు పాత్రికేయ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశాయి. కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా జిల్లా కేంద్రంతో పాటు పలు నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించి అధికారులకు వినతిపత్రాలు అందజేశాయి.

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): సాక్షి దిన పత్రిక ఎడిటర్‌ ధనంజయరెడ్డి, మరో ఆరుగురు పాత్రికేయులపై క్రిమినల్‌ కేసులు బనాయించడాన్ని ఏపీయూడబ్ల్యూజే, చిన్న, మధ్య తరహా పత్రికల సంఘం(సామ్నా) తీవ్రంగా ఖండించాయి. ఆ కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశాయి. ఈ మేరకు శుక్రవారం ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌లో డీఆర్వో ఎం.లక్ష్మీ నరసింహంను కలిసి వినతిపత్రం అందజేశాయి. ఐజేయూ జాతీయ కౌన్సిల్‌ సభ్యుడు ఎస్‌కే బాబు, చిన్న, మధ్య తరహా పత్రికల సంఘం(సామ్నా) రాష్ట్ర అధ్యక్షుడు నల్లి ధర్మారావు, ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ రమణారెడ్డి, ఏపీయూడబ్ల్యూజే అర్బన్‌ శాఖ కార్యదర్శి దారం వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు ఎం. మురళీకృష్ణ, ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లు జి.రఘు రామ్‌, అబ్దుల్‌ ఖదీర్‌, సీనియర్‌ నాయకులు జి.రామారావు, బీవీ శ్రీనివాస్‌, ప్రెస్‌ క్లబ్‌ కోశాధికారి సయ్యద్‌ మహమ్మద్‌ హుస్సేన్‌, జీవన్‌ కుమార్‌ డీఆర్వోకు వినతిపత్రం అందజేసిన వారిలో ఉన్నారు. అనంతరం డీఆర్వో కార్యా లయం ఎదుట బైఠాయించారు. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి, క్రిమినల్‌ కేసులు ఎత్తివేయాలి, పత్రికాస్వేచ్ఛను కాపాడాలంటూ నినాదాలు చేశారు. అనంతరం సామ్నా రాష్ట్ర అధ్యక్షుడు నల్లి ధర్మారావు మీడియాతో మాట్లాడుతూ ‘సాక్షి’ ఎడిటర్‌ ధనంజయరెడ్డి, మరో ఆరుగురు పాత్రికేయులపై కేసులు నమోదు చేయడం రాజకీయ కక్ష సాధింపుల్లో భాగమేనని తాము భావిస్తున్నామన్నారు. సాక్షి ఎడిటర్‌, పాత్రికేయులపై పెట్టిన కేసులు తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. లేదంటే తమ పోరాటం కొనసాగుతుందన్నారు. ఐజేయూ జాతీయ కౌన్సిల్‌ సభ్యుడు ఎస్‌కే బాబు, సామ్నా ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ రమణారెడ్డి తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో ఏపీయూ డబ్ల్యూజే సభ్యులు, ప్రింట్‌,ఎలక్ట్రానిక్‌ మీడియా జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఏపీడబ్ల్యూజేఎఫ్‌, ఏపీబీజేఏ ఆధ్వర్యంలో...

కృష్ణలంక(విజయవాడతూర్పు): సాక్షి దినపత్రిక సంపాదకుడు ధనంజయరెడ్డితో పాటు మరో ఆరుగురు జర్నలిస్టులపై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్‌.వెంకట్రావు,జి.ఆంజనేయులు, ఆంధ్రప్రదేశ్‌ బ్రాడ్‌కాస్ట్‌ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ కన్వీనర్లు వి.శ్రీనివాసరావు, కె.మునిరాజు శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. మాచర్ల మండలంలో జరిగిన పి.హరిశ్చంద్ర అనే వ్యక్తి హత్య కేసు వార్త ప్రచురణ కారణంగా సమాజంలో వైషమ్యాలు పెచ్చరిల్లుతాయనే సాకుతో కేసు బనాయించటం అక్రమమన్నారు. హంతకులను పట్టుకుని శిక్షించాల్సిన పోలీసులు ఆ పనికి బదులుగా ఇటువంటి కేసులు బనాయించటం ఎంతమాత్రం సమంజసంగా లేదన్నారు. ఇటీవల కర్నూలు జిల్లా ఆదోని పోలీస్‌స్టేషన్‌ వ్యవహారాలపై ప్రచురితమైన ఒక వార్తకు సంబంధించి కూడా ఎనిమిది దినపత్రికలకు పోలీసులు నోటీసులు జారీ చేశారని గుర్తు చేశారు. జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేసే ఇటువంటి చర్యలకు పోలీసులు పాల్పడకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరారు. సాక్షి ఎడిటర్‌, జర్నలిస్టులపై పెట్టిన కేసులు ఉపసంహరించు కోవాలని డిమాండ్‌ చేశారు.

సాక్షి ఎడిటర్‌, జర్నలిస్టులపై పెట్టిన క్రిమినల్‌ కేసులు తక్షణం

ఉపసంహరించుకోవాలి

ఏపీయూడబ్ల్యూజే, చిన్న మధ్య తరహా పత్రికల సంఘం (సామ్నా) డిమాండ్‌

ఎన్టీఆర్‌ జిల్లా రెవెన్యూ అధికారికి

వినతిపత్రం అందజేసిన

వివిధ యూనియన్ల నాయకులు

కలానికి సంకెళ్లా..? 1
1/1

కలానికి సంకెళ్లా..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement