
చిలకలపూడి(మచిలీపట్నం): వినియోగదారునికి వడ్డీతో సహా ప్రమాద బీమా మొత్తాన్ని చెల్లించాలని వినియోగదారుల కమిషన్ సభ్యులు నందిపాటి పద్మారెడ్డి, శ్రీలక్ష్మీ రాయలలు బుధవారం తీర్పు చెప్పారు. చల్లపల్లికి చెందిన నూట్రీఫీడ్స్ మేనేజింగ్ పార్టనర్ నాయుడు శ్రీధర్ గోడౌన్‌లో స్టాక్ కోసం ఫైర్ ఇన్సూరెన్స్‌ను ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీలో 2020 ఆగస్టు 7వ తేదీన చేయించారు. 2021 జూన్ 8వ తేదీన గోడౌన్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఇన్సూరెన్స్ కంపెనీకి క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకోగా నిరాకరించారు. దీంతో శ్రీధర్ కమిషన్‌ను ఆశ్రయించారు. సభ్యులను విచారించిన అనంతరం శ్రీధర్‌కు రావాల్సిన రూ. 3,30,544 9 శాతం వడ్డీతో ఇన్సూరెన్స్ కంపెనీ తిరస్కరించిన తేదీ నుంచి చెల్లించాలని, మానసిక వేదనకు గురి చేసినందుకు రూ. 50 వేలు, ఖర్చుల నిమిత్తం రూ. 10 వేలు తీర్పు వెలువడిన 30 రోజుల్లోగా చెల్లించాలని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment