
సమావేశంలో కార్యకర్తలతో మాట్లాడుతున్న వెలంపల్లి శ్రీనివాసరావు
29న వాహన మిత్ర నిధుల విడుదల
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వైఎస్సార్ వాహన మిత్ర పథకం కింద ఈనెల 29న ఐదో విడత సాయం లబ్ధిదారులకు అందించనున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలోని స్టేడియం గ్రౌండ్‌లో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరవుతారన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం భవానీపురంలో గల ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పశ్చిమ నియోజకవర్గ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ రుహుల్లా, దుర్గ గుడి చైర్మన్ కర్నాటి రాంబాబు, కార్పొరేటర్లు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.