అక్కచెల్లెమ్మలకు ఆసరా

- - Sakshi

ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం

మా గ్రూపు సభ్యులకు మూడు విడతలుగా వైఎస్సార్‌ ఆసరా లబ్ధి చేకూరింది. స్వాతి డ్వాక్రా మహిళా సంఘం ద్వారా మేము 12 మంది సభ్యులు పాలవ్యాపారం, కిరాణా షాపు నిర్వహిస్తున్నాం. ఒక్కొక్కరికి ప్రతి విడతలో రూ.16 వేల చొప్పున అందించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటాం.

– బోలెం వనజాక్షి, కరగ్రహారం

వ్యాపారాభివృద్ధికి

దోహదం

వైఎస్సార్‌ ఆసరా ద్వారా మా గ్రూపు సభ్యులందరం వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. గ్రూపు సభ్యులందరం రూ.10 లక్షల రుణం తీసుకున్నాం. వైఎస్సార్‌ ఆసరా పథకం మూడు విడతల్లో మాకు రూ.6 లక్షల మేర లబ్ధి చేకూరింది. మా ఇటుకల వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు ఈ నగదు దోహదపడుతుంది.

– తమ్మన రజనీకుమారి, హుస్సేన్‌పాలెం

మధురానగర్‌(విజయవాడసెంట్రల్‌): రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వైఎస్సార్‌ ఆసరా పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థిక పురోగతి సాధించాలని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి సూచించారు. వైఎస్సార్‌ ఆసరా మూడో విడత నగదు పంపిణీ కార్య క్రమం విజయవాడలోని కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాలు శనివారం జరిగింది. తొలుత ఏలూరు జిల్లా దెందులూరు సభలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగాన్ని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణువర్థన్‌, కలెక్టర్‌ ఎస్‌.ఢిల్లీరావు తదితరులతో కలిసి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. అనంతరం ఎన్టీఆర్‌ జిల్లా లబ్ధిదారులకు చెక్కులను అందజేఽశారు. ఈ సందర్భంగా డెప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ.. మహిళా సాధికారతే లక్ష్యంగా కులం, మతం, రాజకీ యాలకు అతీతంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఎల్‌అండ్‌టీ, రిలయన్స్‌, ఐటీసీ, అమూల్‌, ఆదాని, మహేంద్ర వంటి ప్రముఖ్య వ్యాపార సంస్థలతో ఒప్పందాలు చేసుకుని మహిళ లకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారని వివరించారు. వివిధ రంగాల్లో వ్యాపారాలు చేసేందుకు రాష్ట్ర మహిళలకు బ్యాంకుల ద్వారా ఇప్పటి వరకు రూ.4,355 కోట్లు రుణ సహాయం కింద అందించారని పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం వైఎస్సార్‌ ఆసరాను మూడు విడతలుగా అమలు చేస్తున్నామని తెలిపారు. మూడో విడత ఆర్థిక సాయాన్ని శనివారం నుంచి ఏప్రిల్‌ ఐదో తేదీ వరకు పండుగ వాతావారణంలో పొదుపు సంఘా ల్లోని అక్కచెల్లెళ్ల బ్యాంక్‌ ఖాతాలకు జమ చేసే కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు మాట్లాడుతూ.. వైఎస్సార్‌ ఆసరా, చేయూత, సున్నా వడ్డీ వంటి పథకాలతో మహిళాభివృద్ధికి బాటలు వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మహిళలు అండగా నిలవా లని కోరారు. కలెక్టర్‌ ఎస్‌.ఢిల్లీరావు మాట్లాడుతూ.. వైఎస్సార్‌ ఆసరా పథకం మూడో విడతలో జిల్లాలో 3,21,170 మంది మహిళల బ్యాంక్‌ ఖాతాల్లో రూ.276.79 కోట్లను సీఎం జమ చేశారని తెలిపారు. జిల్లాలో స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థిక పురోగతి సాధించేలా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు వివిధ రంగాలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి, సొంతగా వ్యాపారాలు నిర్వహించేలా సహకరిస్తున్నామని తెలిపారు. మహిళా పాడి రైతులను ప్రోత్సహించేందుకు పాడి పశువులను పంపిణీ చేస్తున్నామని వివరించారు. ఎటువంటి పెట్టుబడి లేకుండా ఇంటి వద్దనే కోళ్లను పెంచుకుని ఆదాయాన్ని సమకూర్చుకునేలా ఒక్కొక్క సంఘానికి పది మేలు రకాల కోళ్లను పంపిణీ చేశామన్నారు. డెప్యూటీ మేయర్లు అవుతు శైలజారెడ్డి, బెల్లం దుర్గ, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు అడపా శేషు, టి.శ్రీకాంత్‌, ఎం.శివరామకృష్ణ, బండి పుణ్యశీల, జమలపూర్ణమ్మ, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో 3,21,170 మందికి రూ.276.79 కోట్ల లబ్ధి విజయవాడలో జరిగిన మూడో విడత పంపిణీ కార్యక్రమం పాల్గొన్న డెప్యూటీ సీఎం నారాయణస్వామి, కలెక్టర్‌, ప్రజాప్రతినిధులు

Read latest NTR News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top