కనకదుర్గనగర్‌లో మరో పొంగలి షెడ్డు | - | Sakshi
Sakshi News home page

కనకదుర్గనగర్‌లో మరో పొంగలి షెడ్డు

Mar 25 2023 2:06 AM | Updated on Mar 25 2023 2:06 AM

- - Sakshi

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): భక్తుల సౌకర్యార్ధం కనకదుర్గనగర్‌లో మరో పొంగలి షెడ్డు ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నట్లు దుర్గగుడి చైర్మన్‌ కర్నాటి రాంబాబు తెలిపారు. దుర్గగుడి ఘాట్‌రోడ్డులోని ఓం టర్నింగ్‌ వద్ద ఏర్పాటు చేసిన పొంగలి షెడ్డును చైర్మన్‌ రాంబాబు శుక్రవారం ప్రారంభించారు. తొలుత స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాద్‌ శర్మ పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం పొంగలి షెడ్డులో చైర్మన్‌ దంపతులు, పాలక మండలి సభ్యులు అడుగు పెట్టారు. పొయ్యిలకు పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం చైర్మన్‌ రాంబాబు దంపతులు పొంగలి వండి అమ్మవారికి నివేదన సమర్పించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్ధం ఘాట్‌రోడ్డులోని పొంగలి షెడ్డులో 20 పొయ్యిలను ఏర్పాటు చేశామన్నారు. కనకదుర్గనగర్‌లో మరో పొంగలి షెడ్డు ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు బుద్దా రాంబాబు, కట్టా సత్తెయ్య, బచ్చు మాధవీకృష్ణ, కొలుకులూరి రామసీత, కేసరి నాగమణి తదితరులు పాల్గొన్నారు.

44,073 మంది

విద్యార్థులు హాజరు

చిలకలపూడి(మచిలీపట్నం): ఇంటర్మీడియెట్‌ రెండో సంవత్సరం మ్యాథ్స్‌–2బి, హిస్టరీ–2, జువాలజీ–2 పరీక్షలకు 44,073 మంది విద్యార్థులు హాజరైనట్లు ఆర్‌ఐవో పి.రవికుమార్‌ శుక్రవారం తెలిపారు. కృష్ణాజిల్లాలో 15,402 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 15,113 మంది విద్యార్థులు హాజరయ్యారని, 289 మంది విద్యార్థులు హాజరుకాలేదని తెలిపారు. ఎన్టీఆర్‌ జిల్లాకు సంబంధించి 29,549 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 28,960 మంది విద్యార్థులు హాజరయ్యారు. 589 మంది హాజరుకాలేదని ఆర్‌ఐవో తెలిపారు. రెండు జిల్లాల్లో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, మాల్‌ప్రాక్టీస్‌ ఎక్కడా జరగలేదని తెలిపారు.

క్వార్టర్స్‌కు చేరిన

రాష్ట్ర హ్యాండ్‌బాల్‌ జట్టు

విజయవాడ స్పోర్ట్స్‌: 45వ జాతీయ జూనియర్‌ బాలికల హ్యాండ్‌బాల్‌ పోటీల్లో రాష్ట్ర జట్టు విజయదుందుభి మోగిస్తోంది. ఉత్తరాఖండ్‌లో జరుగుతున్న లీగ్‌ మ్యాచ్‌లలో విజయం సాధించి జట్టు ప్రీ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. తెలంగాణతో శుక్రవారం జరిగిన ప్రీక్వార్టర్స్‌లోనూ 22–5 తేడాతో ఘన విజయం సాధించింది. ఇందిర 11, తులసి 5 గోల్స్‌ చేయగా తేజస్విని, స్వాతి, సలోని రెండేసి గోల్స్‌ చేశారు. దీంతో జట్టు క్వార్టర్‌ ఫైనల్స్‌లోకి అడుగు పెట్టింది.

సరకు రవాణాలో ఆర్టీసీ మరో ముందడుగు

బస్‌స్టేషన్‌(విజయవాడ పశ్చిమ): సరకు రవాణాలో ఏపీఎస్‌ ఆర్టీసీ మరో ముందడుగు వేసిందని ఆర్టీసీ జోన్‌–2 ఈడీ గిడుగు వేంకటేశ్వరరావు తెలిపారు. ఆర్టీసీ హౌస్‌లోని తన కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘షిప్‌ మంత్రా’ ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా లాజిస్టిక్స్‌లో బుక్‌ చేసిన పార్శిళ్లను, కొరియర్‌లను వినియోగ దారుల ఇంటి వద్ద నుంచే సేకరించి చేరవల్సిన చోట డోర్‌ డెలివరీ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. పార్శిల్‌, కొరియర్‌ విభాగంలో ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.163 కోట్లకు చేరుకుందన్నారు. వినియోగదారుల కోరిక మేరకు లాజిస్టిక్స్‌ సేవలను మరింత విస్తృతం చేసే భాగంలో ‘షిప్‌ మంత్రా’ ఆన్‌ లైన్‌ బుకింగ్‌ పోర్టల్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. దీని ద్వారా డోర్‌ పికప్‌, డోర్‌ డెలివరీని చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రజా రవాణా సంస్థ అధికారి యేసుదానం, కమర్షియల్‌ ఏటీఎం ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

1
1/3

2
2/3

3
3/3

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement