ప్రముఖ సంగీత దర్శకుడు కోటికి జీవన సాఫల్య పురస్కారం | NATS MINI Telugu Sambaralu in Full Swing | Sakshi
Sakshi News home page

ప్రముఖ సంగీత దర్శకుడు కోటికి జీవన సాఫల్య పురస్కారం

Mar 28 2022 4:36 PM | Updated on Mar 28 2022 4:51 PM

NATS MINI Telugu Sambaralu in Full Swing - Sakshi

డల్లాస్, టెక్సాస్: అమెరికాలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్  ప్రతి రెండేళ్లకు ఒక్కసారి నిర్వహించే తెలుగు సంబరాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ సారి కోవిడ్ నేపథ్యంలో మినీ తెలుగు సంబరాలను నిర్వహిస్తోంది. ఈ మినీ  తెలుగు సంబరాల్లో తొలి రోజు డల్లాస్‌లోని ఇర్వింగ్లోని టొయోటా మ్యూజిక్ ఫ్యాక్టరీ లో నిర్వహించారు. ఈ మినీ సంబరాల్లో తెలుగు సినీ సంగీత దర్శకులు కోటి, సినీ నటులు రవి, మెహ్రీన్, పూజా ఝవేరీ, సియా గౌతమ్ పాల్గొన్నారు. 

మిని సంబరాలు తొలి రోజు కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు కోటికి జీవన సాఫల్య పురస్కారాన్ని నాట్స్‌ ప్రదానం చేసింది. తెలుగు సినీ కళాకారులు, గాయకులు తొలిరోజు తమ ప్రతిభా పాటావాలను చూపించి ప్రవాస తెలుగు వారిని అలరించారు. స్థానిక ప్రవాస బాల బాలికల నృత్య, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. బావర్చీ వారి ప్రత్యేక విందు ఏర్పాట్లు అందరి మన్ననలను పొందాయి.

శనివారం ఉదయం 9 గంటలకు జరిగిన కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో రాబోయే రెండేళ్లలో నాట్స్ చేపట్టబోయే పలు కార్యక్రమాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ఏడో అమెరికా తెలుగు సంబరాలు 2023 జూన్ 30 నుంచి జూలై 2 వరకూ  న్యూజెర్సీ లోని ఎడిసన్ రారిటన్ కన్వెన్షన్సెంటర్ జరపాలని నిర్ణయించినట్టు బోర్డ్ చైర్ విమెన్ ఆరుణ గంటి ప్రకటించారు.  ఏడో అమెరికా తెలుగు సంబరాలకు పాస్ట్ చైర్మన్ శ్రీధర్ అప్పసాని కన్వీనర్గా వ్యవహరించనున్నారు.

సేవే గమ్యం అనే నాట్స్ నినాదానికి తగ్గట్టుగా  ఎప్పటిలాగే తెలుగు వారంతా మరిన్ని సేవా కార్యక్రమాలలో పాల్గొని ప్రవాస తోటి తెలుగువారికి అవసరమైనప్పుడల్లా సాయం అందిస్తామని నాట్స్‌ చైర్‌విమెన్‌ అరుణ గంటి అన్నారు. నాట్స్ అభివృద్ధిలో భాగంగా కొత్త భాగస్వాములను చేర్చుకోవాలంటే అన్ని చాప్టర్లకు పిలుపునిచ్చారు. 
ఈ కార్యక్రమంలో నాట్స్ అధ్యక్షులు విజయ శేఖర్ అన్నె, చైర్ విమెన్ అరుణ గంటి, బోర్డ్ వైస్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, పాస్ట్ ఛైర్మన్స్ శ్రీధర్ అప్పసాని, డాక్టర్‌ మధు కొర్రపాటి, వైస్ ప్రెసిడెంట్ బాపునూతి, పాస్ట్ ప్రెసిడెంట్స్ మోహనకృష్ణ మన్నవ, శ్రీనివాస్‌ మంచికలపూడి, బోర్డ్ సెక్రటరీ శ్యామ్ నాళం, కిషోర్ కంచర్ల, ఆది గెల్లి, వీణ ఎలమంచిలి, డాక్టర్‌ ఆచంట,  శ్రీహరి మందాడి, చంద్రశేఖర్ కొణిదెల, వంశీకృష్ణ వెనిగళ్ల, రాజేష్ కాండ్రు, రంజిత్ చాగంటి, మదన్ పాములపాటి, జ్యోతి వనం, మురళీకృష్ణ మేడిచెర్ల, కుమార్ వెనిగళ్ల, ప్రసాద్ ఆరికట్ల, మూర్తి కొప్పాక, భాను ధూళిపాళ, తెదేపా నాయకులు ముళ్ళపూడిబాపిరాజు, అరిమిల్లి నాగరాజు, డల్లాస్ ప్రవాసులు డాక్టర్‌ ప్రసాద్ నల్లూరి, శ్రీకాంత్ పోలవరపు, అనంత్ మల్లవరపు, కేసీ చేకూరి, కొర్రపాటి శ్రీధర్ రెడ్డి, చంద్రారెడ్డి, ఉప్పు వినోద్, సురేష్ మండువ, ఆత్మచరణ్ రెడ్డి, లోకేష్ నాయుడు తదితరులుపాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement