ఇల్లినాయిస్‌లో నాట్స్ ఉమెన్ త్రో బాల్ టోర్నమెంట్

NATS Conducted Women Throw Ball Tournament - Sakshi

ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు మహిళలు

షికాగో: ఉత్తర అమెరికా తెలుగు సంఘం, నాట్స్ తాజాగా నిర్వహించిన ఉమెన్ త్రో బాల్ టోర్నమెంట్ దిగ్విజయంగా జరిగింది. ఇల్లినాయిస్‌లో చికాగో నాట్స్ టీం నిర్వహించిన మిడ్ వెస్ట్రన్ త్రో బాల్ టోర్నమెంట్‌కు మహిళల నుంచి విశేష  స్పందన లభించింది.

కేవలం ఇల్లినాయిస్ మాత్రమే కాకుండా మిచిగాన్, ఇండియానా, విస్కాన్సిన్, మిస్సోరి తదితర రాష్ట్రాల నుంచి మహిళ జట్లు ఈ పోటీలకు హాజరయ్యారు. దాదాపు 150 మందికి పైగా మహిళలు ఈ టోర్నమెంట్‌లో పాల్గొన్నారు. 

విస్కాన్సిన్ కు చెందిన ఎఎస్‌సీటీగ్రెస్‌ టీమ్ టోర్నమెంట్ ఛాంపియన్ షిప్ కైవసం చేసుకుంది. ఇల్లినాయిస్  చెందిన హరికేన్స్ టీం  రన్నర్ అప్ గా నిలిచింది.

నాట్స్ చికాగో కల్చరల్ కో ఆర్డినేటర్ బిందు వీదులముడి ఈ టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. నాట్స్ చికాగో నాయకులు మదన్ పాములపాటి, మూర్తి కొప్పక, విజయ్ వెనిగళ్ల, రవి శ్రీకాకుళం, కృష్ణ నిమ్మగడ్డ, లక్ష్మీ బొజ్జ, వేణు కృష్ణార్దుల, డాక్టర్ ప్రసుధ నున్నా, హరీష్ జమ్ముల, మరియు కార్తీక్ మోదుకూరి తదితరులు ఈ టోర్నమెంట్‌ విజయానికి తమ వంతు సహాయ సహకారాలు అందించారు.

ఈ టోర్నమెంట్‌ విజయవంతం చేయడంలో సహాకరించిన శిల్పా ఎర్రా, పూజా సావంత్, రోజా శీలంశెట్టి, బిందు బాలినేని, ప్రదీప్, ప్రియాంక గుప్తా, సంధ్య అంబటి, సుమతి నెప్పలి, రామ కొప్పక, రవి కిరణ్ ఆలా, శివ దేసు, రాజేష్ వీధులమూడి, ఆర్కే బాలినేని, పండూ చెంగలశెట్టి, యాజ్నేష్, కిరణ్ అంబటి, తుషార్ సావంత్ తదితరులకు నాట్స్  ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది

చదవండి : .Miss Universe Singapore-2021: మిస్‌ సింగపూర్‌గా శ్రీకాకుళం యువతి

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top