కేసీఆర్‌ శకం ముగిసింది | - | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ శకం ముగిసింది

May 4 2026 10:13 AM | Updated on May 4 2026 10:13 AM

కాంగ్రెస్‌ను ఓడించాలని

ప్రజలు డిసైడ్‌ అయ్యారు..

మీడియాతో ఎంపీ అర్వింద్‌ ధర్మపురి

సుభాష్‌నగర్‌: మాజీ సీఎం కేసీఆర్‌ శకం ముగిసిందని, ప్రజలు ఆయన గురించి ఆలోచించడం మా నేశారని ఎంపీ అర్వింద్‌ ధర్మపురి అన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం, కుటుంబం అవినీతి ఊబిలో కూరుకుపోయాయని, ఆయన అవినీతిపై కల్వకుంట్ల కవిత ను అడిగితే చాలా బాగా చెబుతారని ఎద్దేవా చేశా రు. ఈనెల 10న హైదరాబాద్‌కు మోదీ రానున్న నే పథ్యంలో మండల అధ్యక్షులు, నాయకులతో సన్నా హక సమావేశాన్ని నగరంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించారు. అనంతరం జిల్లా ప్రభారీ, మా జీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి గౌతమ్‌రావు, అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌ పా ల్‌ సూర్యనారాయణ, పసుపు బోర్డు చైర్మన్‌ పల్లె గంగారెడ్డితో కలిసి ఎంపీ మీడియాతో మాట్లాడారు.

ఉద్యమకారుల లాగే జీవన్‌రెడ్డి కూడా అధోగ తి పాలుకావాల్సిందేనని ఎద్దేవా చేశారు. సంజయ్‌ ను కేసీఆర్‌ ఒక్క మాట కూడా అనడం లేదని, జగిత్యాల ప్రజలు అయోమయంలో ఉన్నారన్నారు. రేవంత్‌రెడ్డి పార్టీని ఓడించాలని ప్రజలు డిసైడ య్యారని, ఆయనకు పాలనపై పట్టు లేదని విమర్శించారు. పాలనను అస్తవ్యస్తం చేసి ఎన్నికల హా మీలు, గ్యారెంటీలను తుంగలో తొక్కారని విమర్శించారు. ధాన్యం సేకరణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. నిజామాబాద్‌ రూరల్‌ ఎ మ్మెల్యే అన్‌ పాపులర్‌ ఎమ్మెల్యే అయ్యారని ఆరోపించారు. ధాన్యం సేకరణలో జాప్యంపై ప్రభుత్వ సలహాదారు, బోధన్‌ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని, ధా న్యం త్వరగా సేకరించాలని డిమాండ్‌ చేశారు.

పసుపు రైతులకు నాలుగేళ్లుగా సగటున రూ. 14వేల ధర వస్తుందంటే కారణం మోదీ అని, సన్నబియ్యం ఇస్తుంది కూడా ఆయనే అని పేర్కొన్నారు. రూ.7800 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి ప్రధాని మోదీ హైదరాబాద్‌ వస్తున్నారని తెలిపారు.

జిల్లా ప్రభారీ శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ప్రజ లు విశ్వసిస్తున్నారన్నారు. జిల్లా అధ్యక్షుడు దినేష్‌ పటేల్‌ కులాచారి, రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతిరెడ్డి, కార్యవర్గసభ్యులు మేడపాటి ప్రకాశ్‌రెడ్డి, మో హన్‌రెడ్డి, కంచెట్టి గంగాధర్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement