ఏకచక్రేశ్వర గోశాలలో అగ్ని ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

ఏకచక్రేశ్వర గోశాలలో అగ్ని ప్రమాదం

May 4 2026 10:13 AM | Updated on May 4 2026 10:13 AM

ఏకచక్రేశ్వర గోశాలలో అగ్ని ప్రమాదం

10 వేలకు పైగా ఎండు గడ్డికట్టలు దగ్ధం

రూ. 8 లక్షల వరకు నష్టం

బోధన్‌రూరల్‌: పట్టణంలోని ఏకచక్రేశ్వర గోశాలలో ఆదివారం రాత్రి ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో సుమారు 10 వేలకు పైగా ఎండు గడ్డికట్టలు అగ్నికి ఆహుతి అయ్యాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడటంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. స్థానికులు, బోధన్‌ మున్సిపాలిటీ, పోలీసు సిబ్బంది సైతం సహాయక చర్యల్లో పాల్గొని మంటలను ఆర్పేందుకు కృషి చేశారు. గోశాలలోని పశువులను బయటికి తరలించారు. ప్రమాదంతో సుమారు రూ.6 లక్షల నుంచి రూ. 8 లక్షల వరకు నష్టం వాట్లినట్లు ఏకచక్రేశ్వర గోశాల కమిటీ అధ్యక్షుడు నేపాల్‌ సింగ్‌ తెలిపారు. ప్రమాదంపై గోశాల ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement