పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం | - | Sakshi
Sakshi News home page

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

May 4 2026 10:13 AM | Updated on May 4 2026 10:13 AM

తాడ్వాయి(ఎల్లారెడ్డి): తాడ్వాయి మండలంలోని దేమికలాన్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దేమికలాన్‌ ఉన్నత పాఠశాలలో 2006–2007 సంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులు 19 సంవత్సరాల అనంతరం కలుసుకున్నారు. పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకొని, ప్రస్తుతం ఏం చేస్తున్నారో ఒకరినొకరు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చదువు చెప్పిన ఉపాధ్యాయులను సన్మానించారు.

తాండూర్‌లో..

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని తాండూర్‌ హైస్కూల్‌లో ఆదివారం 2011–12 బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 14 సంవత్సరాల తర్వాత కలుకున్న మిత్రులు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఈ సందర్భంగా విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సత్కరించారు.

Advertisement
 
Advertisement
Advertisement