మున్నూరుకాపు సంఘ అభివృద్ధికి కృషి | - | Sakshi
Sakshi News home page

మున్నూరుకాపు సంఘ అభివృద్ధికి కృషి

May 4 2026 10:13 AM | Updated on May 4 2026 10:13 AM

సుభాష్‌నగర్‌: పంచముఖి మున్నూరుకాపు సంఘం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని 6వ డివిజన్‌ కార్పొరేటర్‌ గోపిడి స్రవంతిరెడ్డి అన్నారు. నగరంలోని వినాయక్‌నగర్‌ పంచముఖి మున్నూరు కాపు సంఘం భవనంలో సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్పొరేటర్‌ స్రవంతిరెడ్డితోపాటు పదోన్నతి పొందిన సంఘ సభ్యులు చిట్టి నారాయణరెడ్డి, స్వర్ణలతను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా స్రవంతిరెడ్డి మాట్లాడు తూ.. తనను భారీ మెజార్టీతో గెలిపించిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. డివిజన్‌ అభివృద్ధితోపాటు ఎన్నికల్లో సహకరించిన సంఘాలకు నిధులు కేటాయిస్తామన్నారు. ఎంపీ అర్వింద్‌, అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణతో మాట్లాడి నిధులు అందేలా చూస్తామన్నారు. సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మిద్దె రవికుమార్‌, పోతన్న, కోశాధికారి రమేష్‌, గౌరవాధ్యక్షుడు ఆకుల శ్రీశైలం, ముఖ్య సలహాదారుడు చిట్టి నారాయణరెడ్డి, పెద్ద కాపులు ధర్మేందర్‌, జగదీష్‌, ముత్యం, సహాయ కార్యదర్శులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement