డొంకేశ్వర్(ఆర్మూర్): ఎండలు భగభగ మండిపోతున్నా జిల్లాలో భూగర్భ జలాలు నిలకడగా ఉన్నా యి. సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో వ్యవసాయ బోరు బావుల ద్వారా విపరీతంగా నీటిని తోడడంతో నీటి మట్టం పడిపోతుంది. అయితే ఈ ఏడాది యాసంగి పంటలు త్వరగా కోతకు రావడం వల్ల బోర్ల వినియోగం తగ్గి భూమికి ఊరటనిచ్చింది. జిల్లా భూగర్భజల శాఖ అధికారులు ఏప్రిల్ మా సానికి సంబంధించిన గణాంకాలను శుక్రవారం వెల్లడించారు. జిల్లాలో సగటు నీటి మట్టం 11.88 మీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. ఇది మార్చి నెలతో (11.67మీటర్లు) పోలిస్తే కేవలం 0.21 మీటర్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. 46 డిగ్రీలతో ఎండలు మండిపోతున్నా కూడా జిల్లాలో ఆరోగ్యకమైన భూగర్భ జలాలు ఉండటం విశేషం.
జిల్లాలో 82 పరిశీలక బోరు బావులు...
ప్రతి నెలా భూగర్భ జలాల లెక్కలను తీసేందుకు జిల్లాలో 82 పరిశీలక బోరు బావులను (ఫీజో మీటర్లు) ఏర్పాటు చేశారు. ఏప్రిల్ నెల గణాంకాలు వాటి ఆధారంగా చూస్తే... 30 ఫీజో మీటర్లలో 10 మీటర్ల లోపు నీటి మట్టాలున్నాయి. అలాగే 43 ఫీజో మీటర్లలో 10 నుంచి 20 మీటర్ల లోపు భూ గర్భ జలాలున్నాయి. అదే విధంగా తొమ్మిది ఫీజో మీటర్లలో 20 మీటర్ల పైన లోతులో ఉన్నాయి.
ఎండలు మండుతున్నా..
ఏప్రిల్ నెలలో అదుపులోనే ఉన్న
భూగర్భ జలాలు
తగ్గిన వ్యవసాయ బోర్ల వినియోగం
ప్రస్తుతం జిల్లాలో నీటి మట్టం 11.88 మీటర్లు
అదుపులోనే ఉన్నాయి..
జిల్లాలో భూగర్భ జలాలు అ దుపులో ఉండడం విశేషం. మార్చిలోనే పంటలు చేతికి రావడంతో బోర్ల వాడకం నిలిచిపోయింది. దీంతో సా ధారణంగా వేసవిలో ఉండే ఒత్తిడి భూగర్భ జలాలపై తగ్గింది. రైతులు ఆరుతడి పంటలు వస్తే మరింత నీటి ఖర్చు తగ్గుతుంది. – శ్రీనివాస్‌బాబు, జిల్లా భూగర్భజల శాఖ అధికారి


