ఆర్మూర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ బదిలీ | - | Sakshi
Sakshi News home page

ఆర్మూర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ బదిలీ

May 1 2026 4:04 AM | Updated on May 1 2026 4:04 AM

ఆర్మూర్‌టౌన్‌: ఆర్మూర్‌ మున్సిపల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ ఉమామహేశ్వర్‌రావు బదిలీ అయ్యారు. ఈ మేరకు మున్సిపల్‌ శాఖ గు రువారం ఉత్తర్వులు జారీ చేసింది. బాన్సువాడ మున్సిపల్‌ కమిషనర్‌గా విధులు నిర్వ ర్తించిన శ్రీహరిరాజు ఆర్మూర్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.

విలీన గ్రామాల్లో పనులను వేగవంతం చేయాలి

నిజామాబాద్‌ రూరల్‌: మున్సిపల్‌ కార్పొరేష న్‌ పరిధిలోని విలీన గ్రామాల్లో అభివృద్ధి ప నులను వేగవంతం చేయాలని నిజామాబా ద్‌ రూరల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ ఆర్‌ భూపతి రెడ్డి అధికారులను ఆదేశించారు. నగరంలోని క్యాంప్‌ కార్యాలయంలో మున్సిపల్‌ కమిషనర్‌ దిలీప్‌కుమార్‌, ఎగ్జిక్యూటీవ్‌ ఇంజినీర్‌ రాజు, పబ్లిక్‌ హెల్త్‌ డీఈ నగేశ్‌రెడ్డి, హౌ సింగ్‌ డీఈ రాజలక్ష్మితో గురువారం సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లు, విలీన గ్రామాల్లో అభివృద్ధి, డ్రైనేజీ వ్యవస్థతోపాటు కాలూరు ఊర చె రువు అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. ఎక్కడ కూడా అలసత్వం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మున్సిపల్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

గవర్నర్‌ను కలిసిన

ఎంపీ అర్వింద్‌

సుభాష్‌నగర్‌: రాష్ట్ర గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లాను లోక్‌భవన్‌లో ఎంపీ అర్వింద్‌ ధర్మపురి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్‌తో భేటీ అయిన అర్వింద్‌ తెలంగాణ అభివృద్ధికి స హాయ సహకారాలు అందించాలని కోరా రు. అపారమైన పరిపాలనా అనుభవం, చారిత్రక, సమకాలిన అంశాలపై శివప్రతాప్‌ శుక్లాకు ఉన్న లోతైన అవగాహనతో రాష్ట్రానికి ఎంతగానో ప్రయోజనం కలుగుతుందని ఎంపీ అర్వింద్‌ ఆకాంక్షించారు.

ఎల్‌ఆర్‌ఎస్‌కు

మరో అవకాశం

సుభాష్‌నగర్‌: నిజామాబాద్‌ నగరంలోని ప్లాట్ల యజమానులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించిందని మున్సిపల్‌ కమిషనర్‌ దిలీప్‌కుమార్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పెండింగ్‌లో ఉన్న లే అవుట్‌ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) ఫీజుల చెల్లింపులపై ఏకంగా 25 శాతం రాయితీని ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఈమేరకు మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజనన్‌ జీవో నంబర్‌ 131ను విడుదల చేశారన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ –2020 కింద దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్లాట్‌ యజమానులకు ఈ వెసులుబాటు కల్పించిందని పేర్కొన్నారు. 2026 మే1 నుంచి జులై 31వ తేదీ వరకు మూడు నెలల కాలంలో ఫీజు చెల్లించే వారికి మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని ప్లాట్ల యజమానులు సద్వినియోగం చేసుకొని తమ ఆస్తులను క్రమబద్ధీకరించుకోవాలని కమిషనర్‌ కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement