ఎత్తొండలో మహారాష్ట్ర వాసి అదృశ్యం
రుద్రూర్: మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా సావులి గ్రామానికి చెందిన ఓమాజీ వడాయి అనే వ్యక్తి కోటగిరి మండలం ఎత్తొండ గ్రామంలో అదృశ్యమైనట్టు ఎస్సై సునీల్ గురువారం తెలిపారు. ఓమాజీ వడాయి తన భార్యతో కలిసి వారం రోజుల క్రితం మహారాష్ట్ర నుంచి వరినాట్లు పని నిమిత్తం ఎత్తొండ గ్రామానికి వచ్చాడు. ఈ నెల 16న సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. ఆయన భార్య జీజాబాయి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.


