భత్యంపై ఉద్యోగుల అసంతృప్తి | - | Sakshi
Sakshi News home page

భత్యంపై ఉద్యోగుల అసంతృప్తి

Dec 19 2025 8:25 AM | Updated on Dec 19 2025 8:25 AM

భత్యంపై ఉద్యోగుల అసంతృప్తి

భత్యంపై ఉద్యోగుల అసంతృప్తి

మిగతా డబ్బులు చెల్లించాలి

పోలింగ్‌ విధులు నిర్వహించిన

వారికి తక్కువ భత్యం చెల్లింపు

అసహనం వ్యక్తం చేస్తున్న

ఉద్యోగులు, సిబ్బంది

మోర్తాడ్‌: పంచాయతీ ఎన్నికల విధులు నిర్వహించిన ఉద్యోగులకు ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రకారం కాకుండా తక్కువ భత్యం చెల్లించడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎన్నికల విధులను సజావుగా నిర్వహించిన తమకు సరైన టీఏ, డీఏ చెల్లించకపోవడంలో ఆంతర్యం ఏమిటని ఉద్యోగులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం తుది విడత పోలింగ్‌ బాల్కొండ, ఆర్మూర్‌ నియోజకవర్గాల్లో జరిగింది. 1501 పోలింగ్‌ కేంద్రాల్లో 5,285 మంది ఉద్యోగులు వివిధ హోదాల్లో ఎన్నికల బాధ్యతలను నిర్వర్తించారు. స్టేజ్‌ వన్‌ రిటర్నింగ్‌ అధికారికి ఎనిమిది రోజుల పాటు విధులు నిర్వహించినందుకు రోజుకు రూ.500ల చొప్పున రూ.4వేలు చెల్లించాల్సి ఉంది. అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులకు ఏడు రోజుల విధులకు రూ.3,500, రిటర్నింగ్‌ అధికారి స్టేజ్‌–2 వారికి రూ.4వేలు, ప్రిసైడింగ్‌ అధికారికి రూ.2,500, పోలింగ్‌ అధికారులకు రూ.1,300ల భత్యం చెల్లించాలని ఎన్నికల సంఘం ఆయా జిల్లాల అధికార యంత్రాంగానికి ఆదేశాలను జారీ చేసింది. కానీ ఎక్కడైనా రూ.2 వేలు మాత్రమే భత్యం చెల్లించి అధికారులు చేతులు దులుపుకొన్నారని ఉద్యోగులు వాపోతున్నారు. ఎ న్నికల భత్యం తక్కువగా చెల్లించడంపై అసహనం వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు తమ వాట్సాప్‌ గ్రూపుల్లో పోస్టులను చేస్తూ చర్చను కొనసాగిస్తున్నారు. మొదటి దశ పోలింగ్‌ సిబ్బందికి రూ.2,500 చొప్పున భత్యం చెల్లించగా, రెండో విడతలో రూ.1,500లకే పరిమితం చేశారు. మూడో విడతలో గొడవ చేస్తారనే ఉద్దేశంతో రూ.2 వేల చొప్పున భత్యం చెల్లించారని తెలుస్తోంది. ఈ విషయమై ఉద్యోగులు పంచాయతీ అధికారులను ప్రశ్నిస్తే ఎలాంటి సమాధానం లేదని ఎన్నికల విధుల్లో పాల్గొన్న పలువురు ఉద్యోగులు వెల్లడించారు. ఎన్నికల సంఘం సూచించే భత్యం ఒకలాగా ఉంటే అధికారులు చెల్లించే భత్యానికి తేడా ఉందన్నారు. అసలు ఈ నిధులు ఎటు మళ్లిపోతున్నాయని ఉద్యోగులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

ఖలీల్‌వాడి: ఎన్నికల విధి నిర్వహణకు సంబంధించి రెమ్యునరేషన్‌ తక్కువ చెల్లించిన ఎన్నికల సిబ్బందికి తక్షణమే మిగతా డబ్బులు చెల్లించాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు వివిధ మండలాల ఎంపీడీవోలను ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రంలోని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావుని డీటీఎఫ్‌ జిల్లా శాఖ పక్షాన కలిశారు. రెమ్యునరేషన్‌ చెల్లింపు ఫిర్యాదులపై ఆయనతో చర్చించారు. మొదటిసారి పీవోలు, ఆర్వోలుగా విధులు నిర్వర్తించిన వారికి రూ. 2500లు చెల్లించగా రెండవసారి, మూడోసారి పనిచేసిన వారికి రూ.2 వేలు మాత్రమే చెల్లించారు. మిగతా నగదును ఫోన్‌ పే ద్వారా గాని చెల్లింపులు జరపాలని డీపీవో ఆదేశాల ప్రకారం కార్యాలయ సిబ్బంది ఎంపీడీవోలకు తగు సమాచారాన్ని తెలియజేశారు. ముప్కాల్‌, డిచ్‌పల్లి ఎంపీడీవోలకు మిగతా రెమ్యునరేషన్‌ చెల్లింపునకు ఆదేశించడం జరిగింది. డీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శంతన్‌, జిల్లా ఉపాధ్యక్షుడు పెంటన్న ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement