జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
ఖలీల్‌వాడి: జాతీయ స్థాయి రన్నింగ్ పోటీల కు జిల్లా కేంద్రంలో ని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థిని కుమారి పీ అంబిక ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ బుద్ధిరాజ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల వరంగల్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి 1500 మీటర్ల పరుగు పందెం పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటిందన్నారు. వచ్చే ఏప్రిల్‌లో నిర్వహించే జాతీయ స్థాయి పరుగుపందెం పో టీల్లో పాల్గొనడానికి తమ కళాశాల విద్యార్థిని వెళ్లడం గర్వకారణంగా ఉందన్నారు. అనంతరం అంబికను ప్రిన్సిపాల్, సిబ్బంది అభినందించారు. ప్రిన్సిపాల్, అధ్యాపకుల సహకారంతో తాను ముందుకు వెళ్లగలుగుతున్నానని అంబిక అన్నారు.
ధర్పల్లి: ధర్పల్లి నూతన ఎస్సైగా సామ శ్రీనివా స్ గురువారం బాధ్యత లు చేపట్టారు. ఇది వర కు విధులు నిర్వహించి న ఎస్సై కళ్యాణి సెల వులపై వెళ్లడంతో ఆమె స్థానంలో సామ శ్రీనివాస్ నియమితులయ్యా రు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీనివాస్ మాట్లాడుతూ.. మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతిభద్రతులు పరిరక్షించడానికి కృషి చేస్తానన్నారు. శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించాలని సూచించారు. నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
సుభాష్‌నగర్: జిల్లాలో రేషన్‌కార్డుదారులు తమ వేలిముద్ర సహాయంతో ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ కిరణ్‌కుమార్ గురువారం సూచించారు. జిల్లాలో 4,67,295 కార్డుల్లో 15,72,176 లబ్ధిదారులు ఉన్నారని పేర్కొన్నారు. అందులో 11,03,928 (70.22 శాతం) లబ్ధిదారులు మాత్రమే ఈకేవైసీ పూర్తి చేసుకున్నారన్నారు. 4,68,251(29.78) లబ్ధిదారులు చేయించుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. మిగిలిపోయిన కార్డుదారుల్లో ఐదేళ్లు పైబడిన వారందరూ సమీపంలోని రేషన్‌షాపునకు వెళ్లి ఈకేవైసీని తప్పకుండా చేయించుకోవాలని సూచించారు. ఐదేళ్లలోపు పిల్లలకు ఈకేవైసీ నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిందని తెలిపారు. రేషన్‌షాపు డీలర్లు కూడా షాపులను తెరిచి ఉంచి ఈకేవైసీకి సహకరించాలన్నారు. రేషన్‌షాపుల్లో ఈకేవైసీకి సంబంధించి ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు.
రైల్వే కమాన్‌లో
ఇరుక్కున్న లారీ
బోధన్: బోధన్ నుంచి నిజామాబాద్ కేంద్రానికి వెళ్లే ప్రధాన మార్గంలో ఉన్న ఎడపల్లి రై ల్వేగేట్ వద్ద కమాన్ దాటే క్రమంలో నిజామాబాద్ వైపు నుంచి బోధన్ వస్తున్న పత్తి లోడ్ లా రీ గురువారం ఇరుక్కుంది. దీంతో రైల్వేగేట్‌కు ఇరువైపులా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. లారీలోని పైభాగంలో ఉన్న పత్తి సంచులను తీసివేయగా కమాన్ దాటి వెళ్లింది. అరగంట పాటు రైల్వేగేట్ వద్ద ట్రాఫిక్ స్తంభించి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక


