రాజకీయ కక్షసాధింపు కాదు..
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి
సుభాష్‌నగర్: నేషనల్ హెరాల్డ్ కేసు రాజకీయ కక్ష సాధింపు కాదని, కాంగ్రెస్ అధినేత్రి కుటుంబం చేసిన ఆర్థిక అవినీతికి సంబంధించిన కేసు అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి అన్నారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘నేషనల్ హెరాల్డ్’ ద్వారా రూ.కోట్ల ప్రజాధనం ఒక కుటుంబానికి ఎలా దారి మళ్లిందో దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పై ఉందన్నారు. ఈడీ, కోర్టులు విచారిస్తున్న కేసును ప్రతీకారం అని కాంగ్రెస్ నేతలు చెప్పడం న్యాయవ్యవస్థను అవమానించడమేనని మండిపడ్డారు. బీజేపీ కార్యాలయాల ముట్టడి ఒక డ్రామా అని, దమ్ముంటే అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని దినేశ్ సవాల్ విసిరారు. సమావేశంలో జిల్లా ప్రధానకార్యదర్శి నాగోళ్ల లక్ష్మీనారాయణ, మాజీ కార్పొరేటర్లు న్యాలం రాజు, ప్రమోద్ కుమార్, నాయకులు స్వామి యాదవ్, పద్మారెడ్డి, శంకర్‌రెడ్డి, నారాయణ యాదవ్, తారక్ వేణు, కోడూరు నాగరాజు, పంచరెడ్డి శ్రీధర్, ఇప్పకాయల కిశోర్, ఆమంద్ విజయ్ కృష్ణ, పల్నాటి కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.


