చైనా మాంజా విక్రయిస్తే చర్యలు
బోధన్‌టౌన్: బోధన్ పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన గాలి పటాల దుకాణాల్లో నిర్వాహకులు చైనా మాంజాను విక్రయిస్తే చర్యలు తప్పవని పట్టణ సీఐ వెంకటనారాయణ గురువారం తెలిపారు. సీపీ సాయి చైతన్య ఆదేశాల మేరకు పట్టణంలో ఏర్పాటు చేసిన గాలి పటాల దుకాణాలను తనిఖీ చేయగా పలు దుకాణాల నిర్వాహకులకు సిబ్బందితో కలిసి నోటీసులు అందించినట్లు ఆయన పేర్కొన్నారు. దుకాణాల నిర్వాహకులు చైనా మాంజా విక్రయిస్తే చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.
కామారెడ్డి అర్బన్: జిల్లాలో విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ప్రతిరోజు 18 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు పైడి విఠల్‌రెడ్డి విద్యుత్‌శాఖ ఎస్‌ఈ రవీందర్‌కు గురువారం వినతిపత్రం అందజేశారు. ఎస్‌ఈతో రైతులకు సంబంధించిన వివిధ విద్యుత్ సమస్యలపై చర్చించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శంకర్‌రావు, జిల్లా ప్రతినిధలు, మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.
చైనా మాంజా విక్రయిస్తే చర్యలు


