ఇరిగేషన్ ఉద్యోగుల నూతన కార్యవర్గం ఎన్నిక
నిజామాబాద్ అర్బన్: నీటిపారుదల శాఖ ఉద్యోగుల జిల్లా నూతన కార్యవర్గాన్ని గురువారం టీఎన్జీవోఎస్ కార్యాలయంలో ఎన్నుకున్నారు. ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా కే జనార్దన్, కార్యదర్శిగా సామ్యూల్ వెస్లీ, కోశాధికారిగా ఇక్బాల్, సహాధ్యక్షుడిగా శ్రీనివాస్ మోరె, ఉపాధ్యక్షులుగా వెంకట్‌రాంరెడ్డి, జగన్‌మోహన్, వసంత, సంయుక్త కార్యదర్శులుగా సంపత్, మల్లయ్య, శమంత, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా జయరాజ్, ప్రచార కార్యదర్శిగా శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులుగా అజ్మీమ్, ఆశన్న, చిన్న గంగారాం, శివరాజ్ ఏకగ్రీవంగా ఎన్నకున్నారు.
అనంతరం నూతన కార్యవర్గాన్ని టీఎన్జీవోఎస్ జిల్లా అధ్యక్షుడు సుమన్ అభినందించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన అన్నారు. కార్యక్రమంలో టీఎన్జీవోఎస్ నాయకులు నారాయణరెడ్డి, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.


