పెద్దపులి జన్నారం నుంచే వచ్చింది
భిక్కనూరు: మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ ప్రాంతం నుంచి రెండు నెలల క్రితం తప్పించుకుని వచ్చిన పెద్దపులి కామారెడ్డి జిల్లాలో సంచరిస్తోందని జిల్లా అటవీ అధికారి నిఖిత తెలిపారు. ఆమె మంగళవారం భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డిలో పులి దాడిలో మృతి చెందిన ఆవు కళేబరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జన్నారం నుంచి వచ్చిన పెద్దపులి భిక్కనూ రు, దోమకొండ, బీబీపేట, మాచారెడ్డి మండలాల్లో తిరుగుతోందన్నారు. పులిని వెతికేందుకు అటవీశాఖకు చెందిన నలుగురు ట్రాకర్స్ వచ్చారని, వారితోపాటు జిల్లా అటవీశాఖ అధికారులు, సిబ్బంది తీ వ్రంగా గాలిస్తున్నారన్నారు. ప్రజలు అత్యవసర ప రిస్థితుల్లో టార్చిలైట్‌తోపాటు శబ్దం చేస్తూ వెళ్లాలని సూ చించారు. రాత్రి వేళల్లో గ్రామ శివారులో మంటలు వెలిగించడం, దీపాలు పెడితే పులి గ్రామాల్లోకి రాదన్నారు. కుక్కలు అసహజంగా అరిస్తే నిర్లక్ష్యం చేయకుండా అప్రమత్తం కావాలన్నారు. పులి అడు గుజాడలు కనిపిస్తే ఫొటోలు తీయడానికి, వాటిని చూడడానికి వెళ్లవద్దన్నారు. ఆమె వెంట ఎఫ్‌డీవో రామకృష్ణ, ఎఫ్‌ఆర్‌వో రామకృష్ణ, డీఎఫ్‌ఆర్‌వో శ్రీధర్, సెక్షన్ అధికారులు సయ్యద్ బాబా, మోబేషర్ అలీ, బీట్ అధికారులు సురేశ్, దీపిక, పెద్దమల్లారెడ్డి సర్పంచ్ సాయగౌడ్ ఉన్నారు.
గ్రామాల్లో చాటింపు
దోమకొండ: మండల కేంద్రంనుంచి అంబారిపేట గ్రామానికి వెళ్లే దారిలో ఇటుకబట్టి వద్ద రైతు కొ మ్మాటి శ్రీనివాస్‌కు చెందిన బర్రెను మంగళవారం తెల్లవారుజామున పులి చంపివేసింది. సంఘమేశ్వర్ గ్రామ శివారులో రైతు గంప నారాయణకు చెందిన ఆవునూ చంపేసింది. అంబారిపేటలో బర్రెను చంపిన స్థలాన్ని జిల్లా అటవీ అధికారి నిఖిత, డివిజనల్ పారెస్ట్ అధికారి రామకృష్ణ, పశుసంవర్ధక శా ఖ అఽధికారి శివకుమార్ తదితరులు పరిశీలించారు. మాచారెడ్డి మండలం ఫరీద్‌పేట, దోమకొండ మండలం అంబారిపేట, గొట్టిముక్కుల, బీబీపేట మండలం మందాపూర్ ప్రాంతాల్లో ఎడ్లకట్ట వాగు పరిసరాల్లో పులి సంచరిస్తున్నట్లు గుర్తించామని వారు తెలిపారు. అంబారిపేట, సంఘమేశ్వర్ శివార్లలో ప శువులపై దాడి చేసిన పెద్దపులి చుక్కాపూర్, మాచారెడ్డి అటవీ ప్రాంతం వైపు వెళ్లిందని గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఫారెస్ట్ బీట్ అధికారులు పద్మ, పారూఖ్, సర్పంచులు అరుట్ల కవిత, లోయపల్లి శ్రీనివాస్‌రావు అధికారుల వెంట ఉన్నారు.
పెద్దపులి జన్నారం నుంచే వచ్చింది


