20న జీపీల తొలి సమావేశం
సుభాష్‌నగర్: జిల్లాలో నూతనంగా ఎన్నికై న సర్పంచ్‌లు, పాలకవర్గాల తొలి సమావేశాన్ని ఈనెల 20వ తేదీన నిర్వహించాలని డీపీవో శ్రీనివాస్‌రావు మంగళవారం ఒక ప్రకటనలో ఆదేశించారు. ముందుగా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం, బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించాలని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని ఎంపీడీవో, ఎంపీవో, పంచాయతీ కార్యదర్శులను డీపీవో ఆదేశించారు.
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి
తెయూ(డిచ్‌పల్లి): మాదకద్రవ్యాలు, మత్తుపదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ టీ యాదగిరిరావు సూచించారు. మాదకద్రవ్యాల నియంత్రణపై అవగాహన కల్పి స్తూ రూపొందించిన వాల్ పోస్టర్లను రిజిస్ట్రార్ ఎం యాదగిరితో కలిసి వీసీ తన చాంబర్‌లో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలపై సీఎం రేవంత్‌రెడ్డి చాలా సీరియస్‌గా ఉన్నారన్నారు. మాదకద్రవ్యాల కారణంగా తలెత్తే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహించాలని సూచించారు. యూనివర్సిటీ క్యాంపస్‌లోని బాలుర, బాలికల హాస్టళ్ల గో డలపై వాల్‌పోస్టర్లను అతికించాలని ఆదేశించారు. కార్యక్రమంలో చీఫ్ వార్డెన్ కే.రవీందర్ రెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్ కో ఆర్డినేటర్ అపర్ణ, కంట్రోలర్ కే సంపత్‌కుమార్, వార్డెన్లు కిరణ్‌రాథోడ్, జోత్స్న, హెల్త్ సెంటర్ ఇన్‌చార్జి డాక్టర్ గోపిరాజు తదితరులు పాల్గొన్నారు.
సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ
వాలీబాల్ పోటీలకు ఎంపిక
జక్రాన్‌పల్లి: సౌత్ జోన్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ పోటీలకు మండలంలోని కలిగోట్‌లోని జెడ్పీ హై స్కూల్ పాఠశాల పూర్వ విద్యార్థి భవ్య శ్రీ ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు పురుషోత్తమాచారి, వ్యాయామ ఉపాధ్యాయుడు యాదగిరి బుధవారం తెలిపారు. తమిళనాడులోని చెంగల్‌పట్టు జిల్లా ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో ఈ నెల 17 నుంచి 19 తేదీ వరకు నిర్వహించే పోటీల్లో పాల్గొననున్న భవ్యశ్రీని వీడీసీ సభ్యులు, ఉపాధ్యాయులు అభినందించారు.
20న జీపీల తొలి సమావేశం


