‘అర్బన్’ను ఆదర్శంగా తీర్చిదిద్దాలి
సుభాష్‌నగర్ : అభివృద్ధిలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. నగరంలో చేపడుతున్న అభివద్ధి పనులు, టీయూఎఫ్‌ఐడీసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో నగరంలోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మంగళవా రం సమీక్షించారు. రహదారుల అభివృద్ధి, డ్రె యినేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులు, టీయూఎఫ్‌ఐడీసీ ద్వారా చేపడుతున్న పనుల నాణ్యత, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పురోగతిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి లో రాష్ట్రంలోనే నంబర్ వన్‌గా తీర్చిదిద్దే బా ధ్యత ప్రతి ఒక్క అధికారిదని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఇబ్బందు లు కలగకుండా, అభివద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్‌కుమార్, మున్సిపల్ ఈఈ సుదర్శన్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ డీఈ ప్రవీణ్, పబ్లిక్ హెల్త్ డీఈ నాగేశ్‌రెడ్డి, పబ్లిక్ హెల్త్ ఏఈ శివకృష్ణ, మున్సిపల్, ఆర్ అండ్ బి, పబ్లిక్ హెల్త్ శాఖల అధికారులు పాల్గొన్నారు.


