పసుపు పరిశ్రమను సందర్శించిన నైజీరియా రైతు
జక్రాన్‌పల్లి: మండలంలోని మనోహరాబాద్ గ్రామంలో ఉన్న జేఎంకేపీఎం పసుపు రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని నైజీరియా దేశానికి చెందిన రైతు సాహె ఉల్లెనాన్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా జేఎంకేపీఎం చైర్మన్ పాట్కూరి తిరుపతిరెడ్డితో వారి దేశంలో పండించే పసుపు పంటపై చర్చించారు. నైజీరియాలో తనకు 3 వేల ఎకరాల భూమి ఉందని, అందులో దాదాపు 250 ఎకరాలు పసుపు పండిస్తున్నట్లు తెలిపారు. భారతదేశంలో వచ్చిన మాదిరిగా దిగుబడి రావడం లేదని పేర్కొన్నారు. ఇక్కడి రైతులు తమ దేశానికి వచ్చి మా రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆహ్వానించారు. ఆయన వెంట హైదరాబాద్ బెస్ట్ ఇంజినీరింగ్ కంపెనీ అధిపతి పవన్ శేషసాయి ఉన్నారు.


