నిబంధనలు పాటించాలి: సీపీ
నిజామాబాద్‌అర్బన్: ప్రతి ఒక్కరూ పోలీసు శాఖ నిర్దేశించిన నిబంధనలు పాటించాలని సీపీ సాయి చైతన్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బందికలిగించేలా విగ్రహాలు ప్రతిష్టించొద్దని తెలిపారు. ఊరేగింపులు, సభల నిర్వహణకు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించారు. డ్రోన్ల వినియోగంపై ఆంక్షలు విధించామని తెలిపారు. నకిలీ గల్ఫ్ ఏజెంట్ల నుంచి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
బోధన్‌రూరల్: మండలంలోని కల్దుర్కి గ్రామ సర్పంచ్ ఎన్నికలలో అవకతవకలు జరిగాయని, సర్పంచ్ ఓట్లు రీకౌటింగ్ చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మేడపాటి ప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెల్లని ఓట్లను జోడించి జొన్నల నరేందర్ రెడ్డి అనే వ్యక్తి గెలుపొందినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారని ఆరోపించారు. ఉన్నతాధికారుల విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
వేల్పూర్: వేల్పూర్ మండలం వెంకటాపూర్, కోమన్‌పల్లి గ్రామాలలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ కేంద్రాలను ఆర్మూర్ సబ్‌కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా సోమవారం పరిశీలించారు. పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు సరియైన సౌకర్యాలు ఉన్నవి లేనివి చూశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు ఉండాలని మండలస్థాయి అధికారులకు సూచించారు. ఓటర్లకు తాగునీరు, నీడకోసం టెంట్, వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీకాంత్, ఎంపీడీవో బాలకిషన్, ఆర్.ఐ. గోపాల్,జీపీల కార్యదర్శులు ఉన్నారు.
రాజేంద్రదాస్
మహరాజ్‌కు స్వాగతం
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ ప్రజలు సోమవారం స్వామీ రాజేంద్రదాస్ మహరాజ్‌కు స్వాగతం పలికారు. పెర్కిట్ బైపాస్ వద్ద ఆర్మూర్ ఎమ్మె ల్యే పైడిరాకేశ్‌రెడ్డి, పలుగుట్ట మంగిరాములు మహరాజ్, శ్రీనాథ్ సిద్ధుల గుట్ట కమిటీ సభ్యు లు, భక్తులు పాల్గొని మహరాజ్ ఉన్న వాహనంపై పూలు చల్లారు. గోదావరి నది పరిక్రమణ లోని బృందావనం, అయోధ్య, చిత్రకూట్, ఓంకారేశ్వర్, ఉజ్జయిని, ద్వారా, కాత్రాపురి నుంచి సుమారు 400మంది సాధువులు కార్ల లో ఆర్మూర్ మీదుగా నందిపేట్‌లోని పలుగుట్టకు బయలుదేరారు.
నిజామాబాద్ అర్బన్: ఓ తల్లి రెండు నెలల కు మారుడిని విక్రయించిన ఘటన జిల్లా కేంద్రంలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లమ్మగుట్టకు చెందిన శ్రీనివాస్ ఈ నెల 5న తన భార్య, కుమారుడు కని పించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, ఈ నెల 10న సదరు మహిళ తిరిగి ఇంటికి వచ్చింది. అయితే తల్లితోపాటు కుమారుడు లేకపోవడంతో శ్రీనివాస్ ఆమెను నిలదీశాడు. అతని ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు తల్లే కుమారుడిని మహారాష్ట్ర పుణెలోని విశాల్ అనే వ్యక్తికి రూ.2.40 లక్షలకు విక్రయించినట్లు తేల్చారు. బాలుడి విక్రయంలో ఎల్లమ్మగుట్టకు చెందిన ఇద్దరు, హైదరాబాద్‌కు చెందిన మరో వ్యక్తి మధ్యవర్తిత్వం వహించారు. పోలీసులు బాలుడి తల్లిని, ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బాలుడిని తండ్రికి అప్పగించారు.
నిబంధనలు పాటించాలి: సీపీ
నిబంధనలు పాటించాలి: సీపీ


