చలికాలం.. పిల్లలు జాగ్రత్త!
● తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయొద్దు
● ‘సాక్షి’తో పిల్లల వైద్య నిపుణురాలు డాక్టర్ అనిత
చలికాలంలో ఎలాంటి
జాగ్రత్తలు తీసుకోవాలి?
డాక్టర్: పిల్లలను బయటికి తీసుకువెళ్లే క్రమంలో ఉన్ని దుస్తులు ధరించాలి. చలి తీవ్రత ఉంటే పిల్లలను బయటికి తీసుకెళ్లొద్దు. పాఠశాలలకు వెళ్లే పిల్లలకు స్వెట్టర్స్, మంకీ క్యాప్స్, చేతులకు గ్లౌజులు వంటివి ధరింపచేయాలి. చల్లని నీరు తాగకూడదు. పర్యాటక ప్రాంతాల సందర్శనను రద్దు చేసుకోవాలి. చల్లని నీటి, తీపి పదార్థాలకు దూరంగా ఉంచాలి. తాజా ఆహారం, పండ్లు పెట్టాలి. తల్లిపాలు తాగించాలి.
అత్యవసర పరిస్థితులు ఎప్పుడు వస్తాయి?
చలి తీవ్రతతో పిల్లల్లో ఎక్కువగా దమ్ము వస్తుంది. దీంతో బ్రాంకోలైటిస్ ఏర్పడుతుంది. రెండు నెలల పిల్లల్లో ఎక్కువగా వస్తుంది. జ్వరం ఉండదు కానీ జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. దీంతో జ్వరం లేదని తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే పిల్లల ఊపిరితిత్తుల్లోకి వెళ్లి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఇలాంటి వాటిని ముందుగానే గుర్తించి వైద్యుడిని సంప్రదించాలి. పిల్లలకు జలుబు ఉండి, పాలు తాగకపోతే వైద్యుని వద్దకు తీసుకెళ్లాలి. పాలు మధ్యలో మానేసిన పిల్లలు విపరీతంగా ఏడవడం ప్రమాదమే. దీనిని నిర్లక్ష్యం చేయొద్దు. ఊపిరితిత్తుల్లోకి తెమడ వెళితే శ్వాత తీసుకోవడం ఇబ్బందికరంగా మారుతుంది.
ముక్కు కారితే ఎలాంటి సమస్యలు వస్తాయి?
పిల్లలకు ముక్కు కారడంపై చాలామంది తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తారు. ఇది సరికాదు. ముక్కు కారడం వల్ల పిల్లల్లో న్యుమోనియా వంటి సమస్యలు ఏర్పడతాయి. దీంతో శ్వాసకోస ఇబ్బంది ఏర్పడుతుంది. అస్తమా ఉన్న వారికి ఇది చాలా ప్రమాదకరం.
రోజురోజుకూ చలితీవ్రత పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. చలిగాలుల వ్యాప్తితో చిన్నారులు వ్యాధుల బారినపడే ప్రమాదం ఉంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదని చెబుతున్నారు కిడ్స్ కేర్ ఆస్పత్రి పిల్లల వైద్య నిపుణురాలు అనిత చెప్తున్నారు. చలి నుంచి పిల్లల రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ‘సాక్షి’ ఇంటర్వ్యూలో వివరించారు. – నిజామాబాద్ అర్బన్
చలికాలం.. పిల్లలు జాగ్రత్త!


