సర్పంచ్ విధులు, బాధ్యతలు
మీకు తెలుసా..
రామారెడ్డి: త్వరలోనే పంచాయతీ పాలకవర్గాలు కొలువుతీరనున్న తరుణంలో సర్పంచ్ విధులు, బాధ్యతల గురించి తెలుసుకుందాం.
● గ్రామ పంచాయతీ సమావేశాలకు అధ్యక్షత వహించడం.గ్రామ పంచాయతీ తీసుకున్న ని ర్ణయాలను,తీర్మానాలను అమలు చేయడం.
● గ్రామ పంచాయతీ కార్యనిర్వహణాధికారి (పంచాయతీ కార్యదర్శి) పనితీరును పర్యవేక్షించడం.
● గ్రామాభివృద్ధికి సంబంధించిన పనులు చేపట్టడం, పథకాలను అమలు చేయడం.
● గ్రామ పంచాయతీకి వచ్చే నిధుల వినియోగాన్ని, పన్నుల వసూలును పర్యవేక్షించడం, 100శాతం పన్ను వసూలుకు కృషి చేయడం.
● ప్రభుత్వ అధికారులకు, గ్రామీణ సమాజానికి మధ్య పరిచయ కేంద్రంగా, కీలక నిర్ణయాల రూపకర్తగా వ్యవహరించడం.
ఇతర అధికారాలు
● ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహణలో పాత్ర వహించడం. గ్రామాభివృద్ధి అధికారి నుంచి అవసరమైన సమాచారాన్ని సేకరించడం.
● సభ్యుల అనర్హత లేదా ఖాళీలపై జిల్లా పరిషత్ అధికారులకు తెలియజేయడం.
● మండల పరిషత్ సమావేశాలకు శాశ్వత
ఆహ్వానితులుగా హాజరుకావడం.
● సర్పంచ్ గ్రామ అభివృద్ధి, పరిపాలనలో
కీలకపాత్ర పోషిస్తారు.


