ఘనంగా ఫ్రెషర్స్ డే
రుద్రూర్: మండలంలోని ఆహార శాస్త్ర సాంకేతిక (ఫుడ్ సైన్స్ టెక్నాలజీ కాలేజీ) కళాశాలలో సోమవారం ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఆట పాటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా కళాశాల అసోసియేట్ డీన్ కె. వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రమ శిక్షణతో మెలగాలని, లక్ష్యాన్ని నిర్దేశించుకొని సాధించుకోవాలని సూచించారు. వరి పరిశోధన సంస్థ ఇన్‌చార్జి హెడ్ పరమేశ్వరి, కళాశాల అధ్యాపకులు సాయిప్రసాద్, శ్రీలత, ప్రశాంతి, లక్ష్మీబాయి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.


