గ్రామ బహిష్కరణ ఉన్నా ఎన్నికల బరిలో..
ఆర్మూర్: తన కుటుంబానికి గ్రా మ బహిష్కరణ విధించినా తాను ఎన్నికల బరిలో నిలిచానని ఆర్మూర్ మండలం పిప్రి గ్రామ సర్పంచ్ అభ్యర్థి అనమల సాయన్న తెలిపారు. పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. భూ తగాదాలో తన కుటుంబానికి వీడీసీ గ్రామ బహిష్కరణ విధించిందని, ఆగస్టులో తన తండ్రి చనిపోతే గ్రామస్తులు ఎవ్వరూ హాజరుకాకపోవడంతో పోలీసుల సమక్షంలో అంత్యక్రియలు పూర్తి చేశామన్నారు. ఎఫ్‌ఐఆర్ నమోదైనా వీడీసీ ప్రతినిధులపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో తనపై గ్రామ బహిష్కరణ యథావిధిగా కొనసాగుతోందన్నారు. ఎఫ్‌ఐఆర్ నమోదైనప్పటికీ ఆర్మూర్ సీఐ సత్యనారాయణగౌడ్ వీడీసీకి అనుకూలంగా వ్యవహరిస్తూ తనకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాను సర్పంచ్ బరిలో ఉండగా.. తప్పుకుంటే బహిష్కరణ ఎత్తివేయడంతోపాటు ఆర్థిక సాయం అందిస్తామని కాంగ్రెస్ నాయకులతో రాయబారం చేస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్ సర్పంచ్ అభ్యర్థి బందెల కిరణ్, వీడీసీ సభ్యుడు సోం భూమన్న తనపై గ్రామ బహిష్కరణ ఉందంటూ ప్రచారం చేస్తున్నారని వాపోయాడు. జిల్లా కలెక్టర్, సీపీ కలగజేసుకొని తనకు న్యాయం చేయాలని కోరారు.
ఆర్మూర్‌టౌన్: ఆలూర్ మండల కేంద్రంలో శనివారం మల్లన్న జాతరలో పిల్లలను కిడ్నాప్ చే సేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మల్లన్న జాతరలో ఆ ట వస్తువులు కొనుగోలు చేసేందుకు వచ్చిన 10 సంవత్సరాల వయస్సును నలుగురు పిల్లలను ఓ ఆటోడ్రైవర్ చాక్లెట్లు ఇస్తానని చెప్పి ఆటోలో ఎక్కించుకొని వెళ్తుండగా.. ఇద్దరు పిల్లలు ఆటోలో నుంచి దూకి కేకలు వేశారు. దీంతో స్థానికులు గమనించి ఆటోలో ఉన్న మరో ఇద్దరు పిల్లలను దించి ఆటోడ్రైవర్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ విషయమై పోలీసులను సంప్రదించగా ఆటోలో చిన్నారులు ఆడుకుంటున్నారని.. డ్రైవర్‌ను ఆటోను కొంత ముందుకు తీసుకువెళ్లినట్లు తెలిపారు.


