కీలక నేత అరాచకం
న్యూస్‌రీల్
నిజామాబాద్
అధికార పార్టీ
● మొరం, ఇసుక దందా అక్రమార్కుల చేరదీత
● ఏంచేసినా తలూపే డమ్మీలు సర్పంచ్‌లుగా
ఉండేలా ప్లాన్
● ఆర్మూర్ నియోజకవర్గం పార్టీ సీనియర్ల గగ్గోలు
● పీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదుల వెల్లువ
స్థానిక సంస్థల్లో..
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయభేరి మోగించిందని డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్‌రెడ్డి అన్నారు.
శనివారం శ్రీ 13 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
– 8లో u
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇక రెండు, మూడు విడతల్లో జరుగనున్న పంచాయతీ పోరుపై చర్చ నడుస్తోంది. చివరి రెండు విడతల ఎన్నికలకు సంబంధించి కీలకమైన ఆర్మూర్ నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ వైచిత్రిపై అధికార పార్టీ సీనియర్ నాయకులే గుస్సా అవుతున్నారు. దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీ కోసం పాటుపడిన తమకు ఏమాత్రం ప్రాధాన్యం దక్కడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన నియోజకవర్గ కీలక నాయకుడు వీడీసీలను మించి ‘అంతా నా ఇష్టం’ అన్నట్లుగా వ్యవహరిస్తుండడంతో సీనియర్లందరూ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్‌కు ఫిర్యాదులు చేశారు. సదరు కీలక నాయకుడు పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయకపోగా, గత పదేళ్లలో బీఆర్‌ఎస్‌లో ఇష్టారీతిన వ్యవహరించిన వారిని పార్టీలోకి తీసుకొచ్చి గ్రామాల్లో రాజకీయాలను భ్రష్టు పట్టించినట్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత పదేళ్లలో మొరం, మట్టి, ఇసుక దందా విచ్చలవిడిగా చేసిన అక్రమార్కులను చేరదీసి వారి సహకారంతో గ్రామాల్లో అశాంతిని రేకెత్తించినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో గ్రామ పాలన వ్యవస్థను నిర్వీర్యం చేసే దిశగా సాగుతున్నట్లు సీనియర్ నాయకులు చెబుతున్నారు. ఇందులో భాగంగా తన అనుయాయులే సర్పంచ్‌లుగా ఉండేందుకు గాను రాజకీయాలు చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. తనకు అనుకూలమైన వాళ్లే సర్పంచ్‌లుగా ఎన్నికయ్యేలా కొన్ని డమ్మీ నామినేషన్లు వేయించినట్లు చెబుతున్నారు. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఫలితం లేదని వాపోతున్నారు. సీనియర్లమైన తమను ఏమాత్రం కలుపుకుని పోకుండా సదరు నాయకుడు పూర్తి ఏకపక్షంగా వెళుతూ కేవలం మొరం, ఇసుక దందా చేస్తున్న మాఫియాగాళ్లను ప్రోత్సహిస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ముగ్గురిలో ఇద్దరి చేత నామినేషన్లు ఉపసంహరింపచేయించి తనకు అనుకూలమైన వ్యక్తిని సర్పంచ్‌గా ఏకగ్రీవం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో అక్రమంగా సంపాదించిన వ్యక్తులను చేరదీసి ఇలాంటి పనులు చే యించడమేమిటంటూ పీసీసీ అధ్యక్షుడి వద్దకు ఫి ర్యాదులు వెళ్లాయి. నియోజకవర్గంలోని వివిధ గ్రా మాల్లో అక్రమ ఇసుక, మొరం దందా చేసేవారికి అడ్డంకులు లేకుండా చేసి, వారి నుంచి మామూళ్లు దండుకునేందుకు ఈ కీలక నాయకుడు కుయుక్తులు పన్నుతున్నట్లు చెబుతున్నారు.
రెండో విడతలో ఎన్నికలు జరుగను న్న మాక్లూర్ మండలంలోని ఒక గ్రామంలో ఎన్నికల ప్రక్రియను సదరు కాంగ్రెస్ కీలక నాయకుడు అపహాస్యం చేయించినట్లు పార్టీ సీనియర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొరం, ఇసుక దందాలో ఆరితేరిన ఓ మాజీ సర్పంచ్, అతని కుమారుల ద్వారా సదరు నాయకుడు అరాచకం చేసినట్లు చెబుతున్నారు. ఈ గ్రామంలో ముగ్గురు సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్లు వేయగా వారందరినీ అపహరించి నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లే రోడ్డులో ఓ హోటల్‌లో ఉంచి వ్యవహారం నడిపినట్లు తెలిపారు.
కీలక నేత అరాచకం
కీలక నేత అరాచకం


