ముగిసిన రెండో విడత ప్రచారం | - | Sakshi
Sakshi News home page

ముగిసిన రెండో విడత ప్రచారం

Dec 13 2025 7:29 AM | Updated on Dec 13 2025 7:29 AM

ముగిస

ముగిసిన రెండో విడత ప్రచారం

డిచ్‌పల్లి మండలం నడిపల్లిలో ప్రచారం చేస్తున్న సర్పంచ్‌ అభ్యర్థి

డిచ్‌పల్లి మండలం ధర్మారం(బి)లో ప్రచారం చేస్తున్న సర్పంచ్‌ అభ్యర్థి

డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్‌): రెండో విడతలో జరిగే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్ర చారం శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. ఇక పోలింగ్‌కు ఒక్కరోజే మిగిలింది. దీంతో అ భ్యర్థులు ఓటర్లను ప్రభావితం చేసే పనిలో పడ్డా రు. నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలోని డిచ్‌పల్లి, ధర్పల్లి, ఇందల్వాయి, సిరికొండ, మోపాల్‌, నిజామాబాద్‌ రూరల్‌, జక్రాన్‌పల్లి మండలాలతో పాటు ఆర్మూర్‌ నియోజకవర్గంలోని మాక్లూర్‌ మండలాల్లో పోలింగ్‌ జరుగనుంది. ఇప్పటి వరకు ప్రచారం చేయడంతోపాటు ఇంటింటికీ తిరిగి ఓటర్లను వ్యక్తిగతంగా కలిసి తమకే ఓటు వేయాలని మద్దతు కోరారు. ఈ సారి చాలా చోట్ల పోటీ ఎక్కువగా ఉండడంతో అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ఖర్చుకు వెనకాడకుండా రూ.లక్షలు వెచ్చిస్తున్నారు. చివరి రోజున మద్యం, నగదు పంపిణీ చేయడం ద్వారా ఓటర్లను పూర్తి స్థాయిలో ప్రభావితం చేసి గట్టెక్కే ప్రయత్నాల్లో అభ్యర్థులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సర్పంచ్‌తోపాటు వార్డు సభ్యుల పదవులకు సైతం అడ్డగోలుగా ఖర్చు చేస్తున్నారు. కొందరు ఉపసర్పంచ్‌ పదవిపై కన్నేసిన వార్డు సభ్యులు తాము గెలువడంతోపాటు తమకు అనుకూలమైన వ్యక్తు లను బరిలో దింపి వారిని గెలిపించుకునే ప్రయత్నా లు చేస్తున్నారు. సర్పంచ్‌ అభ్యర్థులకు ఏమాత్రం తగ్గకుండా ఖర్చు పెడుతుండటం విశేషం.

నేతలకు కీలకం..

గ్రామ పంచాయతీ ఎన్నికలు నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్‌ పటేల్‌ కులాచారిలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. డివిజన్‌లో కొ న్ని చోట్ల బీజేపీ, మరికొన్ని చోట్ల బీఆర్‌ఎస్‌ బలంగా ఉండటంతో మెజారిటీ పంచాయతీల ను కై వసం చేసుకొని మరోసారి సత్తా చాటాలని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నాగేశ్‌రెడ్డిలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. నిజామాబాద్‌ రూరల్‌ తన సొంత ని యోజకవర్గం కావడంతో దినేశ్‌ సైతం మెజార్టీ స్థానాలు గెలిచేందుకు ఈ ఎన్నికలను సవాల్‌గా తీసుకుంటున్నారు. రూరల్‌ మాజీ ఎమ్మెల్యే బా జిరెడ్డి గోవర్ధన్‌ పార్టీ అధినేత ఆదేశాల మేరకు బాన్సువాడ నియోజకవర్గానికే సమయం కేటాయిస్తున్నారు. దీంతో రూరల్‌ ఇన్‌చార్జి బాజిరెడ్డి జగన్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థుల గెలుపుకోసం పట్టుదలగా ప్రయత్నిస్తున్నారు.

పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్‌): రెండో విడత పంచాయతీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నిజామాబాద్‌ డివిజన్‌లోని డిచ్‌పల్లి, ధర్పల్లి, ఇందల్వాయి, మోపాల్‌, నిజామాబాద్‌ రూరల్‌, సిరికొండ, మాక్లూర్‌, ఆర్మూర్‌ డివిజన్‌లోని జక్రాన్‌పల్లి మండలాల్లో పోలింగ్‌ జరగనుంది.

నేడు పోలింగ్‌ సామగ్రి పంపిణీ

ఓటర్లను ప్రభావితం చేసే

పనిలో అభ్యర్థులు

8 మండలాల్లో ఎన్నికలు

రూరల్‌ ఎమ్మెల్యే, డీసీసీ, బీజేపీ

జిల్లా అధ్యక్షులకు ప్రతిష్టాత్మకం

ముగిసిన రెండో విడత ప్రచారం 1
1/3

ముగిసిన రెండో విడత ప్రచారం

ముగిసిన రెండో విడత ప్రచారం 2
2/3

ముగిసిన రెండో విడత ప్రచారం

ముగిసిన రెండో విడత ప్రచారం 3
3/3

ముగిసిన రెండో విడత ప్రచారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement