నిరుద్యోగుల కల్పతరువు.. జిల్లా గ్రంథాలయం
ఖలీల్‌వాడి : జిల్లా కేంద్ర గ్రంథాలయం నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తోంది. ఉదయం 4 నుంచి రాత్రి 12 గంటలకు వరకు తెరిచి ఉంటోంది. నిరుద్యోగులకు అవసరమయ్యే నోట్స్ తయారీకి కంప్యూటర్లు, ఉచిత వైఫై సదుపాయం కల్పించారు. ప్రతి శుక్రవారం రెండు పుస్తక పఠన గదులకు మాత్రమే సెలవు ఉంటుండగా, మిగితా స్టడీ హాల్‌లో ఉద్యోగార్థులు చదువుకునే వెసలుబాటు కల్పించారు. ఇక్కడ చదువుకునే వారికి విద్యుత్, తాగునీటి సౌకర్యం, వాష్‌రూమ్‌లు అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం ప్రయివేటు స్టడీ హాళ్లల్లో ఒకరికి రూ.2 వేలు నుంచి రూ.3 వేలు వసూలు చేస్తున్నారు. అయితే జిల్లా గ్రంథాలయంలో ఉచితంగానే అన్ని సేవలను అందిస్తున్నారు. వేసవిలో నిరుద్యోగుల చదువుకు ఇబ్బంది లేకుండా కూలర్లను అందుబాటులో ఉంచారు. ఏదైనా ప్రభుత్వ నోటిఫికేషన్ విడుదల చేస్తే ఆ సమయంలో పాత డీఈవో కార్యాలయంలోని హాల్‌ను తీసుకొని చదువుకునే వీలు కల్పిస్తున్నారు.
భోజన వసతికి ముందుకురావాలి..
జిల్లా గ్రంథాలయంలో ఉద్యోగార్థులు, పాఠకులకు ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన వసతిని నిర్వహించేవారు. ఏడాదిన్నర క్రితం వారు నిలిపివేయగా ఓ డాక్టర్ సహకారంతో మూడు నెలలపాటు భోజన వసతి కల్పించారు. ప్రస్తుతం ఉ ద్యోగార్థులు టిఫిన్ బాక్స్‌లను తీసుకొని వస్తున్నా రు. స్వచ్ఛంద సంస్థలు భోజన సదుపాయం ఏర్పా టు చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు.
రోజూ 400 నుంచి 500 మంది
ప్రిపరేషన్
ఉదయం 4 నుంచి రాత్రి 12 గంటల వరకు చదువుకునే అవకాశం
అందుబాటులో పోటీ పరీక్షల
మెటీరియల్
ప్రశాంత వాతావరణం,
మౌలిక వసతుల ఏర్పాటు


