రెండో విడత పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్
నిజామాబాద్‌అర్బన్: రెండో విడతలో ఎన్నిక లు జరిగే మండలాల పోలింగ్ సిబ్బంది తు ది ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, జనరల్ అబ్జర్వర్ శ్యాంప్రసాద్ లాల్ సమక్షంలో శుక్రవారం నిర్వహించారు. కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీ హాల్‌లో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ ర్యాండమైజేషన్ చేపట్టా రు. ఏకగ్రీవమైన వాటిని మినహాయిస్తూ, ఎన్నికలు నిర్వహించాల్సిన గ్రామ పంచాయతీలకు సంబంధించి మండలాల వారీగా సర్పంచ్, వార్డు స్థానాల్లో పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, వోపీవోలను ర్యాండమైజేషన్ ద్వా రా కేటాయించారు. కార్యక్రమంలో నోడల్ అధికారి పవన్ కుమార్, జిల్లా పంచాయతీ కార్యాలయం ఏవో రాజబాబు పాల్గొన్నారు.
సుభాష్‌నగర్: విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించి మెప్పు పొందాలని ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ పీవీ రాజేశ్వర్‌రావు అన్నారు. నగరంలోని పవర్‌హౌస్‌లో శుక్రవారం ఆయన విద్యుత్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్‌ఈ మాట్లాడుతూ.. విద్యుత్ అధికారులు, సిబ్బంది అందరం కలిసి మన కంపెనీలోనే జిల్లాను ముందు వరుసలో ఉంచేందుకు కృషి చేయాలని తెలిపారు. పొలం బాట, పట్టణ బాట నిర్వహించి వినియోగదారులకు భద్రతపై వివరించాలన్నారు. వి ద్యుత్ సరఫరాలో అంతరాయాలు తగ్గించాలని, ట్రాన్స్‌ఫార్మర్లు పాడవకుండా ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయించాలన్నారు. సమావేశంలో డీఈ రమేశ్, ఎస్‌ఏవో శ్రీనివాస్, డీఈలు శ్రీనివాస్, ఎండీ ముక్తార్, వెంకటరమణ, హరిచంద్ర, రఘు తదితరులు పాల్గొన్నారు.
‘అమృత్ 2.0’ పనుల్లో వేగం పెంచాలి
● ఎన్‌ఎంసీ అదనపు కమిషనర్ రవీందర్ సాగర్
సుభాష్‌నగర్: నగరంలో కొనసాగుతున్న అమృత్ 2.0 పనుల్లో వేగం పెంచాలని నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ రవీందర్ సాగర్ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కార్పొరేషన్‌లో ఇంజినీరింగ్ అధికారులతో శుక్రవారం అమృత్ 2.0 పనులపై సమీ క్ష నిర్వహించారు. నెలల తరబడి పనులు నిలిచిపోవడంపై ఆయన అధికారులపై ఆగ్ర హం వ్యక్తం చేశారు. అనంతరం అదనపు కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధులు దాదాపు రూ.300 కోట్లతో అమృత్ 2.0 స్కీమ్‌లో భాగంగా చేపట్టిన తాగునీరు, యూజీపీ పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. మార్చి 31లోపు పనులు పూర్తి చేసేలా అధికారులు సంబంధిత కాంట్రాక్టర్లపై ఒత్తిడి పెంచాలన్నారు. గడువులోపు పనులు పూర్తి కావాలని, లేకుంటే నిధులు వెనక్కి వెళ్లిపోయే అవకాశం ఉంటుందని తెలిపారు. సమావేశంలో ఇన్‌చార్జి ఈఈ సుదర్శన్‌రెడ్డి, డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.
రెండో విడత పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్


