ఎమ్మెల్సీని కలిసిన కాంగ్రెస్ నగర అధ్యక్షుడు
నిజామాబాద్ రూరల్: నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్‌ను గురువారం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన బొబ్బిలిరామకృష్ణను ఎమ్మెల్సీ వెంకట్ శాలువాతో సన్మానించారు. అలాగే ఎమ్మెల్సీని రామకృష్ణ సన్మానించారు. పట్టణంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని బల్మూర్ వెంకట్ సూచించినట్లు ఆయన పేర్కొన్నారు.
డిచ్‌పల్లి: తనను సర్పంచ్‌గా గెలిపిస్తే ఐదేళ్ల పదవీ కాలంలో గ్రామ పంచాయతీ పరిధిలో పుట్టే ఆడపిల్లకు రూ.ఐదు వేలు ప్రోత్సాహకంగా అందజేస్తానని నడిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి చింతపంటి తేజుపా రాజారాం హామీ ఇచ్చారు. గురువారం నడిపల్లి పంచాయతీ పరిధిలోని డిచ్‌పల్లి రైల్వేస్టేషన్, గాంధీనగర్ కాలనీల్లో తన మద్దతుదారులతో కలిసి రాజారాం ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నడిపల్లి జీపీ పరిధిలో కుల, మతాలలకు అతీతంగా ఎవరి ఇంట్లో ఆడపిల్ల పుట్టినా తన సొంత డబ్బులు రూ.5వేలు పాప పేరిట డిపాజిట్ చేయిస్తానని తెలిపారు. గ్రా మాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని, బ్యా టు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ప్రచారంలో అభ్యర్థి వెంట వార్డు సభ్యులు రాజారాం, మద్దతుదారులు పాల్గొన్నారు.
ధర్పల్లి: గ్రామ అభివృద్ధే తన ధ్యేయమని ధర్పల్లి సర్పంచ్ అభ్యర్థి చెలిమెల శ్రీనివాస్ అన్నారు. గురువారం తన మద్దతుదారులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. తన గుర్తు బ్యాటుకు ఓటు వేసి, ప్రజాసేవ చేసేందుకు సర్పంచ్‌గా ఆశీర్వదించాలని కోరారు. ఎమ్మెల్యే భూపతిరెడ్డి సహకారంతో ధర్పల్లి గ్రామానికి అదనపు నిధులు మంజూరు చేయించి మరింత అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. అవినీతిని పూర్తిగా నిర్మూలిస్తానన్నారు. ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆర్మూర్ బాలరాజ్, నాయకులు, చెలిమెల నర్సయ్య, మల్లికార్జున్ రెడ్డి, సుభాశ్ తదితరులు ఉన్నారు.
నిజామాబాద్‌అర్బన్: నగరంలోని నిఖిల్ సాయి హోటల్ సమీపంలో గురువారం రాత్రి వినాయకనగర్ చెందిన సోని అకస్మాతుగా ఫిట్స్ వచ్చి రోడ్డుపై పడిపోయింది. వెంటనే గమనించిన ట్రాఫిక్ సిబ్బంది షాకీర్ ఆమెకు సహాయం అందించి రోడ్డు పక్కకు తీసుకెళ్లి సపర్యలు చేశారు. అనంతరం షాకీర్‌ను ట్రాఫిక్ పోలీసులు అభినందించారు.
ఎమ్మెల్సీని కలిసిన కాంగ్రెస్ నగర అధ్యక్షుడు
ఎమ్మెల్సీని కలిసిన కాంగ్రెస్ నగర అధ్యక్షుడు


