జోరుగా ఎన్నికల ప్రచారం
డిచ్‌పల్లి: మండలంలోని ధర్మారం(బి) మేజర్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో బ్యాటు గుర్తుకు ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని సర్పంచ్ అభ్యర్థి త్రిపురనేని సాయిప్రసాద్(సాయిబాబా) విజ్ఞప్తి చేశారు. గురువారం గ్రామంలోని పలు వార్డుల్లో తన మద్దతుదారులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ బ్యాటు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని అన్నారు. నాయకులు రామారావు, ఫిలిప్‌రాజ్, శ్రీనివాస్‌రెడ్డి, 3వ వార్డు అభ్యర్థి ఎర్రబచ్చుల పద్మ శ్రీనివాస్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని ఖలీల్‌వాడిలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సిబ్బంది తమ నిజాయితీ చాటుకున్నారు. మాక్లూర్ మండలం జ్యోతినగర్‌కు చెందిన సుజాత గురువారం ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చింది. ఆమె వద్ద రూ. రెండు వేల నగదుతో ఉన్న పర్సు రోడ్డుపై పడిపోయింది. పర్సు పడిపోయిన విషయాన్ని ట్రాఫిక్ సిబ్బంది ఉదయ్, గోపాల్ గమనించారు. పర్సును తీసుకొని అందులోఉన్న అడ్రస్ కనుగొని ఆమెకు పర్సును అందించారు. అనంతరం ట్రాఫిక్ సిబ్బందిని ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ట్రాఫిక్ సీఐ ప్రసాద్ అభినందించారు.
చెత్తను తొలగించరూ!
ఆర్మూర్‌టౌన్: పట్టణంలోని పలు ప్రాంతాల్లో చెత్తాచెదారం పేరుకుపోవడంతో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. దీంతో దుర్వాసన వెలువడుతుండడంతో స్థానికులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టణంలోని మల్లారెడ్డి చెరువు సమీపంలో, హుస్నాబాద్‌కాలనీలో, గోల్‌బంగ్లా వద్ద, మామిడిపల్లి శివారుతోపాటు తదితర ప్రాంతాల్లో చెత్త పేరుకుపోయినా మున్సిపల్ కార్మికులు తొలగించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు పూర్తిస్థాయిలో చెత్తసేకరణ చేయడంలో నిర్లక్ష్యం వహించడంతో ఈ దుస్థితి నెలకొందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి, చెత్తను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.
జోరుగా ఎన్నికల ప్రచారం
జోరుగా ఎన్నికల ప్రచారం
జోరుగా ఎన్నికల ప్రచారం


