సైబర్ నేరాలపై అవగాహన తప్పనిసరి
● ఓటీపీలు చెప్పొద్దు
● ఎస్‌బీఐ ఎల్‌హెచ్‌వో ఏజీఎం
ప్రశాంత్‌కుమార్
డిచ్‌పల్లి: సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎస్‌బీఐ ఎల్‌హెచ్‌వో(హైదరాబాద్) ఏజీఎం ప్రశాంత్‌కుమార్ సూచించారు. డిచ్‌పల్లి మండల కేంద్రంలోని ఎస్‌బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ(ఆర్‌ఎస్‌ఈటీఐ) ఆధ్వర్యంలో వివిధ కోర్సుల్లో శిక్షణ పొందుతున్న అభ్య ర్థులకు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై న ప్రశాంత్‌కుమార్ మాట్లాడుతూ.. మొబైల్ ఫోన్ల ద్వారా ఎక్కువగా సైబర్ నేరాలు జరిగే అవకాశాలున్నాయని వాటిని వాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేస్తే వారికి వ్యక్తిగత సమాచారం, ఓటీపీలు చెప్పవద్దన్నారు. ఎవరైనా సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 నంబర్‌కు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌బీఐ ఏవో నిజామాబాద్ చీఫ్ మేనేజర్లు సోమేశ్వరరావు, రామకృష్ణ, ఆర్‌ఎస్‌ఈటీఐ డైరెక్టర్ రవికుమార్, సిబ్బంది రామకృష్ణ, నవీన్, లక్ష్మీనారాయణ, లక్ష్మణ్, స్వరూప, రాధిక, సౌమ్యరెడ్డి, సంస్థలో శిక్షణ పొందుతున్న అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.


