పరిమితికి లోబడి ఖర్చు చేయాలి
వేల్పూర్: సర్పంచ్, వార్డు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నిబంధనల ప్రకారం ఖర్చు చేయాల ని ఎన్నికల పరిశీలకుడు రవికుమార్ అన్నారు. మండల కేంద్రంలోని స్థానిక రైతు వేదికలో గురువారం అభ్యర్థులకు ఎన్నికల వ్యయంపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మా ట్లాడుతూ.. సర్పంచ్ అభ్యర్థి లక్షన్నర, వార్డు సభ్యు డు రూ. 30వేలు మాత్రమే ఖర్చు చేయాలని సూ చించారు. తహసీల్దార్ శ్రీకాంత్, ఎంపీడీవో బాలకిషన్, ఆర్.ఐ.గోపాల్, ఎంపీవో సాయిలు, అభ్యర్థులు పాల్గొన్నారు.
డొంకేశ్వర్(ఆర్మూర్): డొంకేశ్వర్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో బుక్య లింగం గురువారం సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవాలని, ర్యాలీలకు, సౌండ్ సిస్టంకు తప్పనిసరిగా అనుమతి తీసు కోవాలన్నారు. ఎన్నికల నిబంధనల మేరకే అభ్యర్థులు ఖర్చు చేయాలని సూచించారు. 45 రోజుల్లో పోటీ చేసిన అభ్యర్థులందరూ ఎన్నికల ఖర్చుల వివరాలను సమర్పించాలన్నారు. ఎంపీవో ప్రవీణ్, పరిశీలకులు లోకేశ్వర్ ఉన్నారు.
డొంకేశ్వర్‌లో..
వేల్పూర్‌లో మాట్లాడుతున్న అధికారులు
పరిమితికి లోబడి ఖర్చు చేయాలి


