మనోవికాస కేంద్రం ప్రారంభం
నిజామాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని ఖలీల్‌వాడిలో డాక్టర్ ఏ విశాల్ నూతనంగా ఏర్పాటు చేసిన మనోవికాస కేంద్రాన్ని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పిల్లల మనోవికాస కేంద్రం అందుబాటులోకి రావడం ఎంతో సంతోషకరమన్నారు. నేటి రోజుల్లో పిల్లలు అనేక రకాలుగా బుద్ధి మాంద్యం, ఆలోచన సరళి విధానంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఇలాంటి వారికి ఈ భవనం అందుబాటులోకి వస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అనంతరం ఆస్పత్రిలోని వివిధ విభాగాలను డాక్టర్ రవీందర్ రెడ్డి, మాజీ ఐఎంఏ అధ్యక్షుడు జీవన్‌రావు, డాక్టర్ వై శ్రీధర్ రాజు, డాక్టర్ వి జార్జిరెడ్డి, డాక్టర్ అజ్జా శ్రీనివాస్, డాక్టర్ హరీశ్ స్వామి, ప్రారంభించారు. కార్యక్రమంలో అడ్వకేట్ ఆర్ జగదీశ్వర్, సిద్ధయ్య, డాక్టర్ రాజేశ్, డాక్టర్ పీబీ కృష్ణమూరి, డాక్టర్ కౌలయ్య, డాక్టర్ ఆకుల విశాల్, నాగ పద్మ తదితరులు పాల్గొన్నారు.


