రైతులకు అందుబాటులో ఎరువులు
డొంకేశ్వర్(ఆర్మూర్): యాసంగి పంటలకు సరిప డా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయాధికారి మధు సూదన్ తెలిపారు. మండల పరిధిలోని సిర్పూ ర్ ఎరువుల గోదాంను ఆయన గురువారం పరిశీలించారు. ఎరువుల అమ్మకాలు, నిల్వలను పరిశీలించారు. ప్రస్తుతం మండలంలో 146.28 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, రైతులు అవసరం మేరకే కొ నుగోలు చేసి తీసుకెళ్లాలని సూచించారు. యూరియా కొరత రాకుండా ఎప్పటికప్పుడు మండలానికి తెప్పించి గ్రామాలకు సరఫరా చేస్తున్నట్లు ఏవో తెలిపారు.


