సర్వీస్ ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు
డొంకేశ్వర్(ఆర్మూర్): కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న (ఆర్మీ, నేవీ) వారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల కమిషన్ పోస్టల్ బ్యాలెట్ ఓటు అవకాశాన్ని కల్పించింది. డొంకేశ్వర్ మండలంలో 11 మంది సర్వీస్ ఓటర్లను గుర్తించిన అధికారులు వారు పని చేస్తున్న చోటికి పోస్ట్ చేశారు. పోస్ట్ వారికి చేరిన వెంటనే బ్యాలెట్ పేపర్‌పై ఉన్న ఏదేని ఒక గుర్తుపై టిక్ చేసి రిటర్న్ పోస్ట్ చేస్తారు. ఈ నెల 17న ఎన్నికలు జరగనుండగా రెండు రోజుల ముందే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తమకు చేరుకుంటాయని, వాటిని పోలింగ్ రోజు తెరుస్తామని ఎంపీడీవో బుక్య లింగం తెలిపారు.


