మూడో విడత పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్
నిజామాబాద్ అర్బన్: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా మూడో విడతలో ఎన్నికలు జరిగే మండలాల పోలింగ్ సిబ్బంది సెకండ్ ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, జనరల్ అబ్జర్వర్ శ్యాంప్రసాద్ లాల్ సమక్షంలో బుధవారం నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఎన్‌ఐసీ హాల్‌లో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ ర్యాండమైజేషన్ చేశారు. ప్రక్రియను కలెక్టర్, అబ్జర్వర్ నిశితంగా పరిశీలించారు. ఏకగ్రీవమైన వాటిని మినహాయిస్తూ, ఎన్నికలు నిర్వహించాల్సిన గ్రామ పంచాయతీల్లో పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, వోపీఓలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ప్రక్రియలో నోడల్ అధికారి పవన్ కుమార్, జిల్లా పంచాయతీ కార్యాలయం ఏవో రాజబాబు పాల్గొన్నారు.


