విద్యాదానం గొప్పది
● విద్యార్థులకు తల్లిదండ్రులు,
గురువే ముఖ్యం
● పద్మశ్రీ గరికపాటి నరసింహారావు
బోధన్‌టౌన్(బోధన్): అన్నిదానాల కంటే విద్యాదానం గొప్పదని, విద్యార్థులు ప్రధానంగా తల్లిదండ్రులు, గురువులను దైవంతోపాటు పూజించాలని బ్రహ్మశ్రీ వేదమూర్తులు, పద్మశ్రీ గరికపాటి నరసింహారావు ఉద్బోధించారు. పట్టణంలోని ఆజాంగంజ్ విజయసాయి ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో విద్యాధనం, సర్వధనం, ప్రధానం అనే అంశాలపై బుధవారం ఏర్పాటు చేసిన ప్రవచన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేకమైన పరిరక్షణతోపాటు బాధ్యతగా ఉండాలని, వారి దైనందిన కార్యక్రమాల్లో వెన్నంటి ఉండి భాగస్వాములు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పిల్లలను ఒంటరిగా ఉండన్విరాదని సూచించారు. తల్లిందడ్రులు చేసే ప్రతి పని వారిపై ప్రభావం పడుతుందని, పిల్లలు భవిష్యత్తులో వాటిని అనుసరించే అవకాశం ఉందని పేర్కొన్నారు. గురువులు విద్యార్థులకు మార్గదర్శకులుగా ఉండేలా బోధన సాగించాలని పేర్కొన్నారు. గరికపాటి ప్రవచనాలకు ముందుగా విద్యార్థుల భరతనాట్యం, కూచిపుడి నృత్యాలు అలరించాయి. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం కృష్ణమోహన్, మేనేజర్ చక్రవర్తి, సీపీ సాయిచైతన్య, డీటీసీ ప్రమీల, అసిస్టెంట్ కలెక్టర్ శ్యాంప్రసాద్, ఏసీపీ శ్రీనివాస్, సీఐ వెంకట నారాయణ, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


