మొక్కల పరిరక్షణకు కృషి చేయాలి
● బీఎస్‌ఐ డెక్కన్ రీజినల్ సెంటర్
అధిపతి, శాస్త్రవేత్త రాసింగం
తెయూ(డిచ్‌పల్లి): జిల్లాలోని మొక్కల పరిరక్షణకు, వాటిని బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా (బీఎస్‌ఐ) ద్వారా సర్వే చేపట్టి మొక్కల ఉపయోగాల తోడ్పాటుకు కృషి చేస్తున్నట్లు బీఎస్‌ఐ డెక్కన్ రీజినల్ సెంటర్ అధిపతి శాస్త్రవేత్త ఎల్.రాసింగం తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీ బోటనీ విభాగం ఆధ్వ ర్యంలో ‘హెర్బేరియం తయారీ – నేచర్ వాక్’పై బుధవారం కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎస్‌ఐ శాస్త్రవేత్త రాసింగం ప్రసంగిస్తూ.. బీఎస్‌ఐ ఆధ్వర్యంలో ఇటీవల సుమారు 40 కొత్త మొక్కల జాతులను కనుగొన్నామన్నారు. విద్యార్థులు పరిశోధనలు నిర్వహించి అంతరించిపోతున్న మొక్కల నమూనాలను సేకరించాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్రానంతరం ప్రసిద్ధ శాస్త్రవేత్త డా క్టర్ జానకీ అమ్మాళ్ ఆధ్వర్యంలో బీఎస్‌ఐ పునర్వ్యవస్థీకరణ జరిగిందన్నారు. ప్రస్తుతం బీఎస్‌ఐ దేశవ్యాప్తంగా 12 ప్రాంతీయ కేంద్రాలతో పనిచేస్తూ, 25 లక్షలకు పైగా మొక్కల నమూనాలను కలిగిన సెంట్రల్ నేషనల్ హెర్బేరియంను నిర్వహిస్తోంద న్నారు. బోటనీ హెచ్‌వోడీ అబ్దుల్ హలీమ్ ఖాన్, బీవోఎస్ చైర్మన్ ప్రొఫెసర్ అరుణ, ప్రొఫెసర్ విద్యా వర్ధిని, అధ్యాపకులు శ్రీనివాస్, జలందర్, క్యాంప స్ విద్యార్థులతోపాటు కళాశాలలకు చెందిన బోటనీ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


